Connect with us

Vanabhojanalu

Australia, Melbourne: ఘనంగా తెలుగువారి కార్తీక మాస వనభోజన కార్యక్రమం

Published

on

Melbourne, Australia: NRI తెలుగుదేశం మెల్బోర్న్ (NRI TDP Melbourne) ఆధ్వర్యంలో కార్తీక మాస సందర్బంగా తెలుగువారి వనభోజన కార్యక్రమం వేడుకగా నిర్వహించారు. ముందుగా కార్తీక మాస విశిష్టతను చాటి చెబుతూ తులసి చెట్టు కు పూజ కార్యక్రమం నిర్వహించి తెలుగు వారి చిహ్నం అయినా ఎన్టీఆర్ (NTR) కు ఘనంగా నివాళులు అర్పించారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల వివిధ రోడ్డు ప్రమాదలలో మృతి చెందిన వారికి సంతాపం తెలుపుతూ రెండు నిముషాలు మౌనం పాటించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు (Cultural Programs) ఆహుతులని అలరించాయి. చిన్నారులకు ప్రత్యేక ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రధానం చేశారు.

సంప్రదాయ తెలుగు వంటకాలు తో రుచికరమైన భోజనాలు తో అందరూ ఆస్వాదిస్తూ ఆత్మీయంగా గడిపారు. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ తెలుగు వారి ఐక్యత, సంస్కృతి ని ప్రతిబింభించేలా ఏర్పాటు చేసిన నిర్వాహకులు ను అభినందిస్తూ మున్ముందు కూడా తెలుగుధనాన్ని, ఆచారాలను ప్రోత్సహిస్తూ వాటి ప్రాధాన్యత లు తెలిసేలా NRI తెలుగుదేశం మెలబోర్న్(NRI Telugu Desam Party – Melbourne) వారికి విజ్ఞప్తి చేసారు.

ఈ కార్తీక మాస వనభోజన మహోత్సవ కార్యక్రమంలో భారీగా తెలుగు వారు, స్థానిక నివాసం ఉంటున్న ప్రజలు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నిక అయిన కమిటీ సభ్యులకు (Committee Members) అందరూ శుభాకాంక్షలు, అభినందనలు  తెలిపారు.

error: NRI2NRI.COM copyright content is protected