Connect with us

Politics

Connecticut: TDP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోడెల శివరాం తో ఆత్మీయ సమావేశం విజయవంతం

Published

on

Connecticut: అమెరికా లోని కనెక్టికట్ నగరంలో జరిగిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోడెల శివరాం (Dr. Kodela Shivaram) గారు, NRI టీడీపీ సభ్యులు మరియు కనెక్టికట్ తెలుగు అసోసియేషన్ సభ్యులతో కలసి పాల్గొనడం జరిగినది. ఈ కార్యక్రమంలో అక్కడ స్థిరపడిన, మన రాష్ట్రానికి చెందిన ఉద్యోగులు, వ్యాపార రంగంలో స్థిరపడిన వారు డాక్టర్ శివరాం గారికి ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Rama Rao) గారు మరియు నవ్యాంధ్రప్రదేశ్ తొలి శాసన సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు (Dr. Kodela Siva Prasada Rao) గారి చిత్రపటాలకు ఘన నివాళులు అర్పించి, కార్యక్రమంలో పలువురు ప్రసంగించడం జరిగినది.

ఈ సందర్భంగా కోడెల శివరాం (Dr. Kodela Sivaram) గారు ప్రసంగిస్తూ మహానుభావుడు ఎన్టీఆర్ గారు తెలుగు దేశం పార్టీ స్థాపించి తెలుగు జాతి కి ఒక గుర్తింపు తీసుకొని వస్తే, గౌరవనీయులు మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) గారు తెలుగు వారిని ప్రపంచ పటంలో స్థానం కల్పించడమే కాకుండా, ప్రతి రంగంలో తెలుగు వారిలో ఉన్న పట్టుదలను, క్రమశిక్షణను ప్రపంచంలో ఉన్న అన్ని రంగాలలో మన వారు ఎన్నో విజయాలు సాధించి మనకు మనమే పోటీ అనే విధంగా తెలుగు వారికి ఒక చారిత్రాత్మక స్థానం కల్పించన గొప్ప అభివృద్ధి కాముకుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు.

అదే విధంగా ఎదిగేకొద్దీ ఎలా ఒదిగి ఉండాలో అన్న విషయానికి ఉదాహరణ మన విద్యా శాఖ మాత్యులు లోకేష్ (Nara Lokesh) గారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచ స్థాయి లో నిలబెట్టే ప్రయత్నం లో భాగంగా గూగుల్ డేటా సెంటర్ ను మన రాష్ట్రంలో ఏర్పాటుకు కృషి చేయడం, ఆర్సెలర్, రిలయన్స్, మిట్టల్, BPCL రిఫైనరీ, Google, TCS, cognizant వంటి మల్టీ నేషనల్ కంపెనీలను మన రాష్ట్రంలో నెలకొల్పి, రాష్ట్రాన్ని దేశానికే ఒక ఆదర్శ రాష్ట్రంగా, మన రాష్ట్రాన్ని తీర్చి దిద్దడంలో లోకేష్ గారి కృషి, పట్టుదల రాష్ట్ర అభివృద్ధిలో ఒక చరిత్రాత్మక ఘట్టం గా నిలుచి పోతుంది.

మానసికంగా వేదించారు, కుట్రలు పన్నారు, ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా, ఎక్కడ దడవక, బెదరక, వెనుక అడుగు వెయ్యక అనుకొన్న లక్ష్యాన్ని సాధిస్తూ, మడమ తిప్పని యోధుడిగా తనని తాను మలుచుకున్న తీరు మనందరికీ స్పూర్తి దాయకం. కూటమి ప్రభుత్వం ప్రతి పేదవాడి కుటుంబాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలన్న సంకల్పంతో మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు (Nara Chandrababu Naidu) గారి మానస పుత్రిక గా వారు ప్రతిష్ఠాత్మకమైన చేపట్టిన P4 గురుంచి తెలియజేస్తూ, ఈ కార్యక్రమం దేశానికే ఆదర్శంగా చరిత్రలో నిలిచిపోతుందని, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని పిలుపునిచ్చారు.

కూటమి ప్రభుత్వం టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఒకే కుటుంబంలా కలసి విజన్ 2047 కోసం పనిచేస్తూ రాజకీయ పార్టీలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి, 2029 లో మరో మారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే కార్యక్రమలో ఈనాటి నుండి మనం ప్రతి ఒక్కరం భాగస్వామ్యం అయ్యి రాష్ట్ర అభివృద్ధికోసం పాటుపడాలి అని పిలుపునిచ్చారు.

అభివృద్ధి ఎలా చెయ్యాలో చంద్రబాబు గారిని చూసి నేర్చుకోవాలి. కష్టాలకి ఎదురెళ్లి ఎలా నిలబడి- కలబడి గెలవాలో లోకేష్ గారిని చూసి నేర్చుకోవాలి. నమ్మిన జనం కోసం గొంతు నరం తెగుతున్న అండగా ఉండడం అనేది పల్నాటి పులి కోడెల గారిని చూసి నేర్చుకోవాలి. ఏ మాత్రం కొద్దిపాటి అవకాశం ఉన్న మనకు జన్మ నిచ్చిన జన్మ భూమి రుణం తీర్చుకొనే P4 కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యి, చంద్రబాబు (Nara Chandrababu Naidu) గారి కల సాకారం అయ్యేలా కృషి చేయాలి అని అభ్యర్థన చేశారు.

సమావేశంలో పలువురు వక్తలు ప్రసంగిస్తూ, కోడెల (Kodela Siva Prasada Rao) గారికి తమకి గల ఆత్మీయ అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చూసుకొంటూ, ఎన్ని ఒడి దుడుకులు వచ్చిన, ఎన్ని సార్లు వ్యక్తిగత, రాజకీయ, భౌతిక దాడులు జరిగినా, ప్రాణాలు పోయినా పర్లేదు అంటూ పణంగా పెట్టి, 35 ఏళ్లు నమ్మిన ఒకే పార్టీ, ఒకే నాయకుడితో కలిసి పని చేసిన వ్యక్తి పల్నాటి పులి డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు మాత్రమే.

ఆయన గుర్తుకు వస్తే మొదట గుర్తుకు వచ్చేది పల్నాడు ఫ్యాక్షన్ భూతం. ఆయన గుర్తుకు వస్తే గుర్తుకు వచ్చేది ఒక కోటప్పకొండ, ఒక క్యాన్సర్ హాస్పిటల్, ఒక తారక రామ సాగర్ పేరుతో ప్రపంచంలోనే అతి పెద్ద ఎన్టీఆర్ (NTR) విగ్రహం. అంతే కాదు రాష్ట్రంలో కాదు, దేశానికే ఆదర్శంగా నిలిచి పోయే విధంగా, అడ బిడ్డల ఆత్మనాణ్యతకు సంబంధిన మరుగుదొడ్లు ఓ ప్రపంచ రికార్డ్, మరణం తర్వాత మరింత మంది కి పునర్జన్మ ఇచ్చే అవయవ దానం లో ప్రపంచ గిన్నిస్ రికార్డ్.

చేతులు పరిశుభ్రంగా ఉంటే 80 శాతం అంటువ్యాధులు రావంటూ పిలుపునిచ్చి అమలుపరిచి అదో ప్రపంచ రికార్డ్ తన పేరిట లిఖించుకున్న నిజమైన ప్రజానాయకుడు కోడెల వారంటూ ఈ సందర్భంగా పలువురు కోడెల గారితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో తరణి పరచూరి (Tarani Paruchuri), విశ్వనాథ్ (Viswanath Nayunipati), రమణయ్య, యోగేష్, తేజ, వెంకట్, ప్రశాంత్, సుబ్రహ్మణ్యేశ్వర సుబ్బారావు, ప్రసాద్, బాలు, హేమంత్, సతీష్, NRI TDP సభ్యులు మరియు తెలుగు అసోసియేషన్ ఆఫ్ కనెక్టికట్ (Telugu Association of Connecticut) సభ్యులు పాల్గొన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected