New Jersey: అమెరికా లోని న్యూజెర్సీ నగరంలో ది 28/09/2025 నాడు జరిగిన ఆత్మీయ సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోడెల శివరాం (Kodela Sivaram) గారు, NRI టీడీపీ సభ్యులుతో కలసి పాల్గొనడం జరిగినది. ఈ కార్యక్రమంలో అక్కడ స్థిరపడిన మన రాష్ట్రానికి పలువురు ఐ టి ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, NRI టీడీపీ సభ్యులు డాక్టర్ శివరాం గారికి ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా జరిగిన మీట్ అండ్ గ్రీట్ (Meet & Greet) కార్యక్రమంలో నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Rama Rao) గారు మరియు నవ్యాంధ్రప్రదేశ్ తొలి శాసన సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారి చిత్రపటాలకు ఘన నివాళులు అర్పించి ప్రసంగించడం జరిగినది.
ఈ సందర్భంగా కోడెల శివరాం గారు ప్రసంగిస్తూ కారణజన్ముడు ఎన్టీఆర్ (NTR) గారు తెలుగు దేశం పార్టీ స్థాపించి తెలుగు జాతి కి ఒక గుర్తింపు తీసుకొని వస్తే, గౌరవనీయులు మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగు వారు ప్రపంచంలో ప్రతి రంగంలో తెలుగు వారిని ప్రధాన పోటీ దారునిగా నిలబడే సత్తా అందించి,ప్రపంచ చిత్ర పటంలో తెలుగు వారికి ఒక చారిత్రాత్మక స్థానం కల్పించగలిగారు.
అదే విధంగా నారా లోకేష్ (Nara Lokesh) గారు అ స్థాయిని మరింత పెంపొందించేలా , భవిష్యత్ లో తెలుగువారు, తమకు తామే పోటీ అంటూ శాసించ దగ్గ స్థాయి కి వెళ్ళడం లో ప్రధాన పాత్ర వహించడం చాలా గొప్ప విషయం. నారా లోకేష్ గారిని గత ప్రభుత్వ హయాంలో వైసీపీ వారు పెట్టిన ఇబ్బందులు దాటుకుంటూ ఒక గొప్ప శిల్పి లాగా తనని, తాను మలుచుకుంటూ భావితరాలకు బంగారు భవిష్యత్తు అందించే ఉత్తమ నాయకత్వం గల నాయకునిగా మారిన తీరును మనం అందరం ఆదర్శంగా తీసుకొనాలి.
మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టే ప్రయత్నంలో భాగంగాగూగుల్ డేటా సెంటర్ ను మన రాష్ట్రంలో ఏర్పాటుకు కృషి చేయడం ఆర్సెలర్, రిలయన్స్, మిట్టల్, BPCL రిఫైనరీ, Google, TCS, Cognizant వంటి మల్టీ నేషనల్ కంపెనీలను మన రాష్ట్రంలో నెలకొల్పి రాష్ట్రాన్ని దేశానికే ఒక ఆదర్శ రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని తీర్చి దిద్దడంలో వారి కృషి అసమానం.
ప్రతి పేదవాడి కుటుంబాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలన్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆశయం చాలా గొప్పది అంటూ వారు ప్రతిష్ఠాత్మకమైన చేపట్టిన P4 అనే కార్యక్రమం గురుంచి తెలియజేస్తూ, ఈ కార్యక్రమం దేశానికే ఆదర్శంగా చరిత్రలో నిలిచిపోతుందని, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని పిలుపునిచ్చారు.
కూటమి ప్రభుత్వం టీడీపీ బీజేపీ, జనసేన పార్టీలు ఒకే కుటుంబంలా కలసి విజన్ 2047 కోసం పనిచేస్తూ రాజకీయ పార్టీలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి, 2029 లో మరో మారు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) గారు ముఖ్యమంత్రి అయ్యే కార్యక్రమలో ఈనాటి నుండి మనం ప్రతి ఒక్కరం భాగస్వామ్యం అయ్యి రాష్ట్ర అభివృద్ధికోసం పాటుపడాలి అని అభ్యర్థన చేస్తూ..
ఈ కార్యక్రమం నా జీవితంలో ఒక మరుపురాని అనుభూతి గా నిలిచి పోతుంది, కోడెల కుటుంబం మీద మీరు చూపిస్తున్న అభిమానం నాన్న గారి ఆశయాన్ని కొనసాగిస్తూ, ఆయన నమ్మిన సిద్ధాంతం, కష్టం అని ఏ కార్యకర్త వచ్చినా అర క్షణం ఆలస్యం చేయకుండా కాపాడుకోవాలి అన్న దాని కోసం నా తుది శ్వాస వరకు నిలబడతానని తెలియజేశారు.
సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ కోడెల గారికి తమకి గల ఆత్మీయ అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. బ్రతికిన, మరణించినా పులి, పులే అన్నారు, ఇప్పటికీ ఆయన పేరు గుర్తుకు వస్తే వణికే బ్యాచ్ ఉన్నారంటే నమ్మిన వారి కోసం ఆయన నిలబడిన తీరు, ఎదుర్కొన్న పరిస్థితులు, అ పల్నాడు ప్రాంతంలో ఒక శాశ్వత ముద్ర వేసుకొని వెళ్ళిపోయారంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
కోడెల గారంటే పార్టీ కి కట్టప్ప, కోడెల గారంటే ఒక నిజాయితీ, ఒక నమ్మకం,కోడెల గారు గుర్తుకు వస్తే కోటప్పకొండ- క్యాన్సర్ ఆసుపత్రి ముందుగా గుర్తుకు వస్తాయని, అవి రెండు అభివృద్ధి లో వారు చేసిన కృషి భావితరాలకు ఆదర్శం అంటూ, మంత్రిగా రాష్ట్రానికి, నాయకుడిగా పార్టీకి చేసిన సేవలు తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించ దగ్గ వ్యక్తి కోడెల వారంటూ..
ఈ సందర్భంగా పలువురు కోడెల గారితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో బాలాజీ వీర్నాల, సుమన్ పూదోట, రవి పోట్లూరి(తానా), NATS ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి, హరిబాబు, అజయ్ వడ్లమూడి, జాగర్లమూడి, వంశీ వెనిగళ్ల, పవన్ చెన్నుపాటి, రంజిత్, NRI టీడీపీ సభ్యులు పాల్గొన్నారు.