Atlanta, Georgia: శీతాకాలపు తొలి రోజులలో వచ్చే బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పడుతుంది. మరి అటువంటి వైబ్రెంట్ ఫెస్టివల్ ని గత 25 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ (Telangana Development Forum – TDF) ఈ సంవత్సరం కూడా అట్లాంటాలో వైభవంగా నిర్వహించింది.
ఎంగిలి పూల బతుకమ్మతో నవరాత్రులను ప్రారంభించి ప్రోమోతోనే అట్లాంటా వాసులను ఆకట్టుకున్న తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ అట్లాంటా చాప్టర్ (TDF Atlanta Chapter) వారు సెప్టెంబర్ 27 శనివారం రోజున కమ్మింగ్ (Cumming, Atlanta) పట్టణంలోని అలయన్స్ అకాడమీ ఫర్ ఇన్నోవేషన్ స్కూల్ లో బతుకమ్మ & దసరా సంబరాలు ఘనంగా నిర్వహించారు.
ముందుగా వ్యాఖ్యాత డా. వాణి గడ్డం అందరికీ సాదర ఆహ్వానం పలుకగా, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ అట్లాంటా చాప్టర్ (TDF Atlanta Chapter) అధ్యక్షులు గణేష్ తోట సారధ్యంలోని కార్యవర్గ సభ్యులు జ్యోతి ప్రజ్వలనతో బతుకమ్మ మరియు దసరా సంబరాలను సాంప్రదాయబద్దంగా ప్రారంభించారు.
అట్లాంటా (Atlanta, Georgia) మహిళలు ఒక పక్క తమ బతుకమ్మలను తీసుకువచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటుండగా, మరో పక్క సాంస్కృతిక కార్యక్రమాలు (Cultural Programs) మొదలెట్టారు. క్లాసికల్ డాన్స్ విభాగంలో చేసిన నృత్యాలు ఆహ్వానితులను ఆకట్టుకున్నాయి.
ఈ లోకల్ టాలెంట్ ప్రదర్శనల స్కూల్స్ సమన్వయకర్తలను వేదికపైకి ఆహ్వానించి చక్కగా గౌరవించారు. అలాగే పార్టిసిపెంట్స్ కి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ అట్లాంటా చాప్టర్ (TDF Atlanta Chapter) కార్యవర్గ సభ్యుల చేతుల మీదుగా అభినందన పత్రాలు అందజేశారు.
గాయనీగాయకులు ఉమ జంగా మరియు సంతోష్ భరత్ ఎల్లపంతుల ఇటు భక్తి పాటలు అటు సినిమా పాటలతో ఆకట్టుకున్నారు. అనంతరం తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ అట్లాంటా చాప్టర్ (TDF Atlanta Chapter) అధ్యక్షులు గణేష్ తోట అందరినీ ఉద్దేశించి ప్రసంగించారు.
పూజారి ఆగమనం, పూజకి కావాల్సిన ఏర్పాట్లు చకచకా సాగాయి. దసరా, జమ్మిపూజ మరియు షమీ పూజ శాస్త్రోక్తంగా నిర్వహించారు. అలాగే అందరికీ ప్రసాదం పంచారు. ఫోటో బూత్, మెయిన్ స్టేజ్ అలంకరణ బహు బాగుంది. పలువురు షాపింగ్ స్టాల్ల్స్ (Shopping Stalls) వద్ద కలియ తిరుగుతూ కనిపించారు.
తదనంతరం స్పాన్సర్స్ ని వేదిక పైకి ఆహ్వానించి శాలువా, జ్ఞాపికతో కరతాళధ్వనులు నడుమ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డా. వాణి గడ్డం (Dr. Vani Gaddam)మాట్లాడుతూ.. ఇటువంటి చక్కని కార్యక్రమాల నిర్వహణకు స్పాన్సర్స్ మరియు పార్టిసిపెంట్స్ ప్రాముఖ్యతను వివరించారు.
తదనంతరం మహిళలు బతుకమ్మ (Bathukamma) ఆటతో కార్యక్రమానికి వెలుగు తెచ్చారు. మహిళలు, పిల్లలు సర్కిల్స్ ఫార్మ్ చేసి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాటలు పాడుతూ ఉత్సాహంగా అమ్మవారిని కొలిచారు. పిల్లలు సైతం ఉల్లాసంగా పాల్గొనడం కొసమెరుపు.
బతుకమ్మ పోటీలకు క్యాష్ బహుమతులు, బతుకమ్మను తీసుకువచ్చిన ప్రతి ఆడపడుచుకి వేదికపైకి పిలిచి చీర అందించారు. అలాగే ర్యాఫుల్ డ్రా తీసి బహుమతులు అందించారు. వందన సమర్పణలో భాగంగా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ అట్లాంటా చాప్టర్ (TDF Atlanta Chapter) అధ్యక్షులు గణేష్ తోట అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.
ముఖ్యంగా స్పాన్సర్స్, వాలంటీర్స్, ఈ ఈవెంట్ కి విచ్చేసి విజయవంతం చేసిన అట్లాంటా వాసులకు, కార్యవర్గ సభ్యులు, ఫోటో & వీడియో సేవలందించిన జాన్, డెకొరేటర్స్, అలయన్స్ అకాడమీ ఆఫ్ ఇన్నోవేషన్ (Alliance Academy for Innovation) స్కూల్ యాజమాన్యానికి ఇలా ప్రతి ఒక్కరికీ గణేష్ తోట (Ganesh Thota) ధన్యవాదాలు తెలిపారు.
ఆ తర్వాత మహిళలందరూ బతుకమ్మను కొలుస్తూ ఊరేగింపుగా వెళ్లి నీటిలో నిమజ్జనం చేశారు. చివరిగా పండుగ భోజనంతో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ అట్లాంటా చాప్టర్ (TDF Atlanta Chapter) వారి బతుకమ్మ & దసరా సంబరాలు విజయవంతంగా ముగిశాయి.
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ అట్లాంటా చాప్టర్ (TDF Atlanta Chapter) వారు ఘనంగా నిర్వహించిన 2025 బతుకమ్మ మరియు దసరా సంబరాలకు సంబంధించిన మరిన్ని ఫోటోల కోసం www.NRI2NRI.com/TDF Atlanta Chapter Bathukamma 2025 ని సందర్శించండి.