Connect with us

Government

మాతృభూమిపై మమకారాన్ని చాటే అవకాశమే వికసిత్ భారత్ రన్‌ @ New Jersey

Published

on

New Jersey: భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది.. జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన భారతీయ ఐక్యత, ప్రగతిని ప్రదర్శించేందుకు భారతీయులంతా కలిసి రావాలని ఈ కార్యక్రమం నిర్వహించేందుకు భారతీయ అమెరికన్ కమ్యూనిటీ, న్యూయార్క్ (New York) నగరంలోని భారత కాన్సులేట్ జనరల్ మద్దతుతో న్యూజెర్సీ (New Jersey) లోని శ్రీ శివ విష్ణు ఆలయం పిలుపునిస్తోంది.

న్యూజెర్సీ (New Jersey) లోని శ్రీ శివ విష్ణు ఆలయం (సాయి దత్త పీఠం) ఈ ‘వికసిత భారత్ రన్ ను ఘనంగా నిర్వహించడానికి సిద్ధమైంది. మన మాతృభూమి సాధించిన అద్భుత ప్రగతిని, ముఖ్యంగా 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా భారతదేశం సాగిస్తున్న చారిత్రక ప్రయాణాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ఈ పరుగులో భారతీయ అమెరికన్లంతా పాల్గొనాలని సాయిదత్త పీఠం (Sai Datta Peetham) కోరుతోంది.

భారత్-అమెరికా (India – USA) మైత్రిని మరింత పటిష్టం చేసుకునేందుకు ఈ రన్ ఒక వేదికగా మారనుంది. స్థానిక, జాతీయ ప్రవాస భారతీయ సంస్థలను కలుపుకుని సాయిదత్త పీఠం (Sai Datta Peetham) ఈ రన్‌ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. వికసిత భారత‌లో ప్రవాస భారతీయుల పాత్ర ఎంత కీలకం అనేది ఈ రన్ ద్వారా చాటి చెప్పనుంది.

వికసిత భారత్ రన్
తేదీ: సెప్టెంబర్ 28, 2025
ఉదయం 9 గంటలకు
ప్రాంతం: 1665 Oak Tree Road, Edison, New Jersey లోని శ్రీ శివ విష్ణు ఆలయ పార్కింగ్ స్థలం నుంచి ప్రారంభం

పరుగు/నడక అనంతరం అల్పాహారం ఏర్పాటు చేయబడింది.
రండి! మాతృభూమిపై మమకారాన్ని చాటేలా అడుగు వేద్దాం!

Please Register at https://tinyurl.com/RunForBharat2025.

error: NRI2NRI.COM copyright content is protected