ఉత్తర అమెరికా తెలుగు సంఘము (TANA) అధ్వర్యంలొ నార్త్ సెంట్రల్ టీం మిన్నియాపోలిస్ (Minneapolis, Minnesota) బెతూన్ ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చెయటం జరిగింది. దాదాపు 100 మంది స్కూల్ విధ్యార్ధులకి తానా నార్త్ సెంట్రల్ రిప్రసెంటేటివ్ రామ్ వంకిన, మరియు ప్రథినిధులు వేదవ్యాస్ అర్వపల్లి (Vedavyas Arvapalli), మురళి కృష్ణ , శ్రీమాన్ యార్లగడ్డ (Sriman Yarlagadda) చెతుల మీదగా బాక్ ప్యాక్లూ అందించారు.
అమెరికాలోని కమ్యూనిటీకి తమ వంతుగా సేవలందించాలన్న ఉద్దేశ్యంతో తానా (TANA) అధ్యక్షులు నరెన్ కొడాలి (Naren Kodali) మరియు ఉపాధ్యక్షులు శ్రినివాస్ లావు (Srinivas Lavu) నాయకత్వంలొ తానా ఈ బ్యాక్ ప్యాక్ కార్యక్రమాన్ని నిర్వహిస్తొందని తానా ప్రథినిధులు తెలియచెసారు.
తానా నార్త్ సెంట్రల్ (TANA North Central Chapter) ప్రతినిధి రామ్ వంకిన (Ram Vankina) ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయడం అయినది. ఈ కార్యక్రమాన్ని సమన్వయపరిచినందుకు తానా కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్ సాయి బొల్లినేని (Sai Bollineni), కోశాధికారి రాజా కసుకుర్తి (Raja Kasukurthi) కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచెసారు.
ఈ కార్యక్రమానికి తానా నార్త్ సెంట్రల్ (TANA North Central Chapter) వాలంటీర్స్ వెంకట్ జువ్వ (Venkat Juvva), జయరాం నల్లమోతు, సలాది నాయుడు, అజయ్ తాళ్లూరి (Ajai Talluri), రామకృష్ణ అన్నే, సురేష్ బొర్రా, రావు గుత్తా, కోటేశ్వర రావు పాలడుగు మరియు రామరాజు కనుమూరి సహకారం అందిచడం అయినది.
ఈ సందర్భంగా బెతూన్ ఎలిమెంటరీ స్కూల్ (Bethune Community School) నిర్వాహకులు, టీచర్లు మాట్లాడుతూ, తానా కమ్యూనిటీకి చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. తానా బ్యాక్ ప్యాక్ (TANA Backpack Project) కింద తమ స్కూల్‌ను ఎంపిక చేసుకుని పిల్లలకు స్కూల్ బ్యాగ్‌లను పంపిణీ చేసినందుకు వారు స్థానిక తానా నాయకులకు ధన్యవాదాలు చెప్పారు.