Dallas, Texas:మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సస్ (Mahatma Gandhi Memorial of North Texas) ఆధ్వర్యంలో డాలస్ లో మహాత్మాగాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి భారత దేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్ని ఘనంగా జరుపుకున్నారు. మహాత్మా గాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. తోటకూర ప్రసాద్ (Dr.Thotakura Prasad) మాట్లాడుతూ..
“దేశ స్వాతంత్ర్య సముపార్జనలో, సర్వసం త్యాగం చేసి అసువులు బాసిన సమరయోధులకు, గాంధీ (Mahatma Gandhi), నెహ్రు, వల్లభ భాయ్ పటేల్, నేతాజీ శుభాష్ చంద్రబోస్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ లాంటి నాయకుల కృషి ఎంత కొనియాడినా తక్కువే అన్నారు.
డా. తోటకూర భారత పతాక ఆవిష్కరణ చేసి, శుక్రవారం పనిరోజు అయినప్పటికీ, ఉదయమే ఇంత పెద్ద సంఖ్యలో ప్రవాస భారతీయలు హాజరుకావడం వారి మాతృ దేశభక్తిని చాటు తుందని అంటూ అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
తెనాలి డబుల్ హార్స్ వారు ఇండియా నుంచి పంపిన అందరికీ ప్రీతి పాత్రమైన తెలుగింటి సున్నిండలు అందరి ముఖాలలో చిరునవ్వులు చిందించాయి. బోర్డు సభ్యులు రాజీవ్ కామత్ (Rajeev Kamath), మహేందర్ రావు, రాజేంద్ర వంకావాల, తిరుమల్ రెడ్డి కుంభం, జస్టిన్ వర్గీస్, భారతి మిశ్రా, కళయ్ కృష్ణమూర్తి తదిర నాయకులు హాజరైనారు.