Chicago, August 9, 2025: తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు కూన రవి కుమార్ తో ఎన్నారై టీడీపీ చికాగో విభాగం వారు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆగష్టు 9 శనివారం సాయంత్రం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్లైన్ ఫీల్డ్ (Plainfield, Illinois) లోని కానూరు ఫార్మ్ హౌస్ వేదికగా నిలించింది.
ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు. అందరూ ఆముదాలవలస శాసన సభ్యులు కూన రవి కుమార్ (Koona Ravi Kumar) ని ఘనంగా సత్కరించారు.
కూన రవి కుమార్ బీ.టెక్ బళ్లారిలో చదవటం వలన బళ్లారి కాలేజ్ వాళ్ళు, శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలు కలసి మాట్లాడుకోవటం జరిగింది. కూన రవి కుమార్ సిబిఎన్ (Nara Chandrababu Naidu – CBN) క్వాంటమ్ కంప్యూటర్స్ (Quantum Computers) విజన్ గురించి చెప్పారు.
అందరూ ఉత్సాహంగా ఫోటోలు దిగారు. కూన రవి కుమార్ (Koona Ravi Kumar) మేనల్లుడు రాంబాబు గారు, రవి కాకరాల (Ravi Kakarala), శ్రీనివాస్ పెద్దమల్లు (Srinivas Pedamallu), చిరంజీవి గల్లా (Chiranjeevi Galla) ఈ కార్యక్రమం నిర్వహించారు.