Connect with us

Schools

TANA Backpack Program @ Dallas: 300 మందికి పైగా పేద విద్యార్థులకు స్కూలు బ్యాగ్యుల పంపిణీ

Published

on

Dallas, Texas, August 9, 2025: తానా (TANA) ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కోటపాటి గారి ఆధ్వర్యంలో, ప్రస్తుత తానా అధ్యక్షులు నరేన్ కొడాలి (Naren Kodali) గారు సారథ్యంలో, డల్లాస్‌లో HEB ISD లోని పాఠశాలలకు 300 మందికి పైగా పేద విద్యార్థులకు విద్యాసామగ్రి సహాయార్థం స్కూలు బ్యాగులను అందజేశారు.

అమెరికాలోని పేద విద్యార్థులకు బ్యాక్‌ప్యాక్ వితరణ అనే కార్యక్రమం తానా (Telugu Association of North America – TANA) మాజీ అధ్యక్షులు డా. నవనీత కృష్ణ (Dr. Navaneetha Krishna Gorrepati) గారు ఆలోచనతో ప్రారంభించిన ఈ కార్యక్రమం గత రెండు దశాబ్దాలుగా కొనసాగుతోంది.

మన తెలుగు వారెందరికో అమెరికా జీవనోపాధి కల్పించి, సొంత పౌరులతో సమానంగా మన ఎదుగుదలకు పలు అవకాశాలు కల్పించి, మనకు ఎన్నో అవకాశాలు అందించిన అమెరికాకు సేవ చేయాలనే సంకల్పంతో, ఇక్కడ ఉన్న పేద విద్యార్థులకు తిరిగి ఇవ్వాలనే సదుద్దేశంతో ‘తానా’ సంస్థ ఈ కార్యక్రమం చేపడుతుంది.

అమెరికా సమాజంతో మమేకమై ఇక్కడ నివసిస్తున్న పేద పిల్లలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడుతున్నందుకు చాలా ఆనందంగా ఉందని సతీష్ కోటపాటి మరియు తానా కార్యవర్గం బృందం అన్నారు. ఇటువంటి సమాజసేవా కార్యక్రమాలు చేపట్టడానికి, తానా లాంటి స్వచ్చంద సంస్థకి సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వచ్చిన దాతలు, కార్యకర్తలకు తానా కార్యవర్గ బృందం ధన్యవాదాలు తెలియజేసింది.

ఈ సందర్భంగా డల్లాస్‌ (Dallas, Texas) లో స్థానిక యూలెస్‌లోని H.E.B పాఠశాలలో 300 లకు పైగా స్కూల్ బ్యాగులను అందజేశారు. H.E.B ISD సూపరింటిండెంట్ డా. జో హ్యారింగ్టన్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా తానా వారు H.E.B ISD స్కూలు పిల్లలకు అందిస్తున్న సహాయాన్ని అభినందించి, H.E.B ISD ఫ్యామిలీస్ తరుపున ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) కు కృతజ్ఞతలు తెలియజేశారు.

డల్లాస్ (Dallas, Texas) పరిసర ప్రాంతాల్లో చేపట్టే సమాజ సేవా కార్యక్రమాలను ఇతర స్థానిక సంస్థలతో కలసి పనిచేసేందుకు తానా ఎల్లప్పుడూ కృషి చేస్తుందని, రాబోయే కాలంలో తానా అధ్యక్షులు నరేన్ కొడాలి, తానా (TANA) కార్యవర్గ బృందం సహకారంతో మరిన్ని మంచి కార్యక్రమాలను మీముందుకు వస్తామని, అందరు తానా నిర్వహించే కార్యక్రమాలలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు.

‘తానా’ ఈరోజు నిర్వహించిన ‘బ్యాక్ ప్యాక్’ కార్యక్రమంలో తానా (TANA) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మల్లి వేమన, తానా ఫౌండేషన్ ట్రస్టీ సతీష్ కొమ్మన, తానా జాయింట్ సెక్రటరీ లోకేష్ నాయుడు కొణిదల, తానా ఫౌండేషన్ ట్రస్టీ డా. ప్రసాద్ నల్లూరి, తానా మీడియా కోఆర్డినేటర్ పరమేష్ దేవినేని, తానా కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్ సాయి బొల్లినేని పాల్గొన్నారు.

అలాగే తానా (Telugu Association of North America – TANA) టీమ్ నుంచి అను ప్రసాద్ యలమంచిలి, సుజయ్ ఇనగంటి, రాజేంద్ర ముప్పలనేని, అనిల్ రాయల, వెంకటేష్ యలమంచి, ఈశ్వర్ గుండు వంటి, చినసత్యం వీర్నపు, సుధీర్ చింతమనేని వంటి పలు నగర ప్రముఖులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected