Connect with us

Felicitation

AP రాష్ట్ర గ్రంధాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు కి సత్కారం @ Washington DC

Published

on

Washington DC: సాటి మనిషి కష్టాన్ని గుర్తించింది చంద్రబాబే.. మానవ నాగరికతా వికాసంలో. పుస్తక పఠనం అత్యంత ప్రధానమైనది. అమెరికా రాజధాని మెట్రో ప్రాంతంలో, భాను మాగులూరి (Bhanu Maguluri) ఆధ్వర్యంలో.. రాష్ట్ర గ్రంధాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు (Gonuguntla Koteshwar Rao) ను ప్రవాసాంధ్రుల తల్లిదండ్రులు సత్కరించారు..

ఈ సందర్భంగా గోనుగుంట్ల కోటేశ్వరరావు, మన్నవ సుబ్బారావు (Mannava Subbarao), చల్లా జక్కి రెడ్డి, భాను మాగులూరి మాట్లాడుతూ.. మానవత్వంతో తెలుగుదేశం ప్రభుత్వం దివ్యాంగులకు, వృద్ధులకు, వితంతువులకు దేశంలో ఎక్కడ లేని విధంగా, పెన్షన్ లు పంపిణి చేస్తున్నది. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయము చేసుకుంటూ, రాష్ట్రం ప్రగతి పధంలో పయనిస్తుంది.

దివ్యాంగులకు పార్టీలో ప్రాధాన్యత నిచ్చారు. వికలాంగులకు పెన్షన్ ఆరు వేలు, పది వేలు, పదిహేను వేలు చొప్పున ఇచ్చి ఆదుకుంటున్నారు. భగవంతుడు మనకిచ్చిన శక్తిని, యుక్తిని, సంపదనూ, అధికారాన్ని సమాజ హితానికి ఖర్చుపెట్టాలి. మంచిపుస్తకం మంచి నేస్తంతో సమానం.. అన్ని రకాల ఆధునిక ప్రసార మాధ్యమాల కన్నా పుస్తకం గొప్పదనేది అందరం గ్రహించాలన్నారు.

ఈ కార్యక్రమంలో చామర్తి శ్రావ్య (Chamarthi Shravya), బోనాల రామకృష్ణ, దొప్పలపూడి అరుణ్ కుమార్, పునుగువారి నాగిరెడ్డి, బండి సత్తిబాబు, నంబూరి చంద్రనాధ్, చల్లా సుబ్బారావు, వనమా లక్షినారాయణ తదితరులు పాల్గొన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected