Connect with us

Service Activities

Sattenapalli, AP: కట్టమూరులో ఉచిత వైద్య శిబిరం, నాట్స్ అధ్యక్షునికి MLA కన్నా సన్మానం

Published

on

Kattamuru, Sattenapalli, Andhra Pradesh, August 1, 2025: అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ముమ్మరంగా సేవా కార్యక్రమాలు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా సత్తెనపల్లి నియోజకవర్గం కట్టమూరు గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది.

కట్టమూరు గ్రామానికే చెందిన నాట్స్ (NATS) అధ్యక్షుడు శ్రీహరి మందడి (Srihari Mandadi) చొరవతో ఏర్పాటైన ఈ ఉచిత వైద్య శిబిరంలో స్థానికులకు ఉచితంగా వైద్య సేవలు అందించారు. అవసరమైన మందులు అందించారు. 50 మందికి నాట్స్ ఉచితంగా కళ్ల అద్దాలను అందించింది.

సత్తెనపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు కన్నా లక్ష్మీ నారాయణ, నాట్స్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni), ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్, నాట్స్ మాజీ అధ్యక్షుడు మన్నవ మోహనకృష్ణ (Mannava Mohana Krishna) లు ప్రారంభించారు.

అమెరికాలో ఉంటున్న సొంత గ్రామం మేలు కోసం శ్రీహరి మందడి ఆలోచించడం అభినందనీయమని కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshmi Narayana) అన్నారు. నాట్స్ (NATS) చేస్తున్న సేవా కార్యక్రమాలపై కన్నా ప్రశంసల వర్షం కురిపించారు.

పలువురు ప్రవాసులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. నాట్స్ (North America Telugu Society – NATS) అధ్యక్షుడి స్థానంలో తన సొంత గ్రామానికి వచ్చిన శ్రీహరి మందడి ని కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshmi Narayana – Sattenapalli MLA), కట్టమూరు గ్రామస్థులు ఘనంగా సన్మానించారు.

error: NRI2NRI.COM copyright content is protected