Connect with us

Government

Texas, Dallas లో కొత్తగా ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్ (ICAC) ప్రారంభం

Published

on

Dallas, Texas: వాషింగ్టన్, డి.సి.లోని భారత రాయబార కార్యాలయం (Embassy of India) డాలస్ నగరంలో కొత్తగా ప్రారంభించిన ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్ (ICAC) ఆగస్ట్ 1వ తేదినుంచి అమలులోకి వచ్చింది.

ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ (IAFC) అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర (Dr. Prasad Thotakura) మాట్లాడుతూ “ప్రవాస భారతీయల సంఖ్య అంత్యంత వేగంగా పెరుగుతున్న డాలస్ (Dallas) నగరంలో ఇలాంటి ఒక కేంద్రం కావాలని ఎన్నో ఏళ్లగా భారత ప్రభుత్వాన్ని కోరుతున్నామని, అది ఇప్పటికి సాకారం కావడం సంతోషదాయకం అన్నారు.

ప్రతి చిన్న కాన్సులర్ సేవకు డాలస్ నుండి హ్యుస్టన్ వెళ్లి రావడానికి పది గంటలకు పైగా సమయం వెచ్చించాల్సి వస్తోందని, ఇప్పుడు ఆ ప్రయాస తప్పుతోందని అన్నారు. శనివారంతో సహా వారానికి ఆరు రోజులు పనిచేసే ఈ కేంద్రం 8360 LBJ Free Way, Ste. # A 230, Dallas, TX లో నెలకొని ఉన్నదన్నారు. పాస్‌పోర్ట్ (Passport) పునరుద్ధరణ, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) సేవలు, వీసా (Visa) దరఖాస్తులు, జనన మరియు వివాహ రిజిస్ట్రేషన్లు వంటి కాన్సులర్ (Consular) సేవలను ఈ కేంద్రంలో పొందవచ్చునని తెలియజేశారు.”

సుదూర ప్రయాణం చేయవలసిన అవసరం లేకుండా డాలస్ (Dallas) లోనే ఎక్కువ భారతీయ కాన్సులర్ సేవలను సులభంగా పొందే అవకాశం కల్పించినందులకు అమెరికాలో గౌరవ భారత రాయబారి వినయ్ క్వాట్రా (Vinay Kwatra), కాన్సల్ జనరల్ డి. సి మంజునాథ్ (DC Manjunath), వి.ఎఫ్.స్ అధికారులకు ప్రవాస భారతీయులందరి తరపున IAFC అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్ (ICAC) ప్రారంభోత్సవం సందర్భంగా- ఫోటో (ఎడమ నుంచి కుడికి) వి.ఎఫ్.ఎస్ అధికారి సుభాశీష్ గంగూలి, ఫ్రిస్కో నగర కౌన్సిల్ మెంబర్ బర్ట్ టక్కర్, ఐ.ఏ.ఎఫ్.సి అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, టెక్సాస్ రాష్ట్ర రిపబ్లికన్ పార్టీ నాయకుడు పాట్రిక్ వ్యామ్ హాఫ్, వి.ఎఫ్.ఎస్ డిప్యూటీ మేనేజర్ తన్వి దేశాయ్.

error: NRI2NRI.COM copyright content is protected