Connect with us

News

‘అరాచకంపై అక్షర సమరం’ వ్యాస సంపుటి ఆవిష్కరణ @ Washington DC

Published

on

Washington, D.C.: జరిగిన దుర్మార్గాలని ‘అరాచకంపై అక్షర సమరం’లో తెదేపా సీనియర్ నేత, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు (Mannava Subbarao) ఎండగట్టారని వక్తలు కొనియాడారు. ఇలాంటి ఎందరో నాయకుల పోరాట పటిమతోనే రాష్ట్రంలో నియంతృత్వానికి చిరునామా లేకుండా ప్రజలు చెరిపేశారని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు (Raghu Rama Krishna Raju) అన్నారు.

వాషింగ్ టన్ డీసీ (Washington, D.C) లో ‘అరాచకంపై అక్షర సమరం’ పేరుతో మన్నవ సుబ్బారావు వ్రాసిన వ్యాస సంపుటిని శుక్రవారం ప్రముఖ దర్శకుడు కే రాఘవేంద్రరావు (K Raghavendra Rao) తో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ…” గత ప్రభుత్వ తప్పిదాలను సునిశితమైన విమర్శలతో, పరిశీలనాత్మకంగా శోధించి వివిధ పత్రికలకు 200కు పైగా వ్యాసాలను రాయడం అభినందనీయమన్నారు.

కుల, మత, ప్రాంతాల పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతూ వికృత రాజకీయాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రజల గొంతుకై మన్నవ సుబ్బారావు (Mannava Subbarao) తన కలం ద్వారా గళం విప్పారు. నేర రాజకీయాల కబందహస్తాల నుండి ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో తనవంతు పాత్ర నిర్వహించారు” అని పేర్కొన్నారు.

ప్రముఖ సినీ దర్శకులు రాఘవేంద్రరావు మాట్లాడుతూ… ప్రజల అంతరంగాన్ని శోధించి మన్నవ సుబ్బారావు (Mannava Subbarao) విశ్లేషించారు. గత ఐదు సంవత్సరాల్లో పాలన ఎన్నడూ చూడలేదు. హింస, వేధింపులు, అణచివేతలు చూశాం. మానవ సమాజాన్ని సమూలంగా ధ్వంసం చేశారు. అందుకే ప్రజలు తిరగబడ్డారు. ఇవన్నీ వ్యక్తిగత విషాదాలు కావు, సామూహిక విషాదాలే అని అన్నారు.

మైలవరం శాసనసభ్యులు వసంతకృష్ణప్రసాద్ మాట్లాడుతూ…
ప్రశ్నిస్తేనే ప్రజాస్వామ్యం ఫరిడమిల్లుతుందన్నారు. ప్రజల పక్షాన నిలిచి జనం గొంతుకయ్యారు. గత అవినీతి, అసమర్థ పాలనకు చరమగీతం పాడేందుకు మన్నవ సుబ్బారావు రాసిన వ్యాసాలు దోహదపడ్డాయి.

మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ..
పౌర హక్కులనే కాదు.. అసలు జీవించే హక్కునే జగన్మోహన్ రెడ్డి కాలరాశారు. ఆధునిక ప్రజాస్వామ్యంలో ఇలాంటి పాలన దేశ చరిత్రలో ఎక్కడా చూడలేదు. తన పాలనలోని లోపాలను ఎవరూ ప్రశ్నించకూడదు, చైతన్యరహితంగా ఉండాలని ఆయన భావించారు. ప్రజలను చైతన్యపరచేందుకు బాధ్యత కలిగిన పౌరుడిగా నా కర్తవ్యాన్ని నిర్వహించానన్నారు.


తానా పూర్వ అధ్యక్షులు సతీష్ వేమన మాట్లాడుతూ…
దేశంలో ఎక్కడా లేని క్రూరమైన అమానుష చట్టాల అమలుపై అక్షర సమరం చేశారన్నారు.
ఈ కార్యక్రమంలో, భాను మాగలూరి (Bhanu Magaluri), సుధీర్ కొమ్మి(Sudheer Kommi) తదితరులు పాల్గొన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected