Bo’ness, Scotland: భువన విజయం (Bhuvana Vijayam) సంస్థ, జెట్ యుకే (JET UK) మద్దతుతో నిర్వహించిన చారిత్రాత్మక కార్యక్రమంలో భాగంగా, మహా ఆచార్య శ్రీ చిన్న జీయార్ స్వామికి (Sri Chinna Jeeyar Swamiji) 29 జూన్ సాయంత్రం ఘన సంప్రదాయ స్వాగతం పలికింది. 29 జూన్ బో’నెస్ టౌన్ హాల్ (Bo’ness Town Hall) లో ఆయన తొలి స్కాట్లాండ్ (Scotland) ఉపన్యాసాన్ని 500 మందికి పైగా భక్తుల సమక్షంలో నిర్వహించారు.
స్వాగత ఊరేగింపు కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకుడు విజయ్ కుమార్ రాజు పర్రి (Vijay Kumar Raju Parri) స్వామీజీకి తాజా పూలమాల సమర్పించగా, అద్వితీయ్ అర్జున్ రాజు పర్రి (Adviteey Arjun Raju Parri) (విజయ్ కుమార్ రాజు పర్రి కుమారుడు) స్కాటిష్ (Scottish) కళ ఐనటువంటి బ్యాగ్‌పైప్ (Bagpipe) ప్రదర్శనను స్థానిక కళాకారులతో కలిసి ఆకట్టుకునేలా ప్రర్శించారు!
తరువాత ప్రసాద్ మంగళంపల్లి (Prasad Mangalam Palli) మరియు ముఖ్య అతిథి డా. శ్రీహరి వల్లభజౌస్యుల (Dr. Srihari Vallabhajousula) సంయుక్తంగా పూర్ణకుంభ స్వాగతం నిర్వహించారు. సాయి దొడ్డ (Sai Dodda) వారి సమూహం సాంప్రదాయబద్దంగా కోలాటం ప్రదర్శించారు. పిల్లలు సంయుక్త నృత్యం పుష్పమాల సమర్పణ.
శైలజ గంటి (Shailaja Ganti), హిమబిందు జయంతి (Himabindu Jayanti), మమత వుసికల (Mamatha Vusikala) నిర్వహించిన మంగళ ఆరతి వరకు అన్ని క్షణాలు ఉత్సాహభరితంగా సాగాయి. రంజిత్ నాగుబండి (Ranjith Nagubandi) సమన్వయం చేయగా, మిథిలేష్ వద్దిపర్తి (Mithilesh Vaddeparthi) కార్యక్రమ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమం నిజరూపం దాల్చడంలో రాజశేఖర్ జాల (Rajashekar Jala) JET UK వారితో సమన్వయం చేస్తూ ముఖ్యభూమికను పోషించారు.
వేదికపై ప్రదర్శింపబడిన కుచిపూడి (Kuchipudi) నృత్యం, ఆరాధనామయ రామ సంకీర్తనం (Ram Sankirtana), వీణా వాయిద్య ప్రదర్శన (Veena performance), శ్రీ విష్ణు సహస్రనామ (Sri Vishnu Sahasranama) పఠనం , ప్రజ్ఞ పిల్లల శ్లోక (Pragna Children’s Shloka) పఠన కార్యక్రమాలు ఆహూతులను అలరిస్తూ సాగాయి.
ఆ పిదప స్వామీజీ “Ego, Equality & Eternity — A Journey from Self to Supreme” అనే ఉపన్యాసంలో నిత్యవేదాంతసారాన్ని ఆధునిక జ్ఞానంతో మేళవిస్తూ, “అహంకారాన్ని అధిగమించిన ప్రతి హృదయంలో సమానత్వాన్ని, ప్రతి శ్వాసలో శాశ్వతత్వాన్ని కనుగొంటాం” అని ఉత్సాహపూరితంగా పేర్కొన్నారు.
ఆయన “భువన విజయం” (Bhuvana Vijayam) అనే పేరు వింటే రోమాలు నిక్కబొడుస్తున్నట్లు అనిపిస్తోందన్నారు, ఐదున్నర శతాబ్దాల తరువాత భువన విజయం సభ ప్రాభవాన్ని పునరుజ్జీవింపజేసినందుకు సంస్థను అద్భుతంగా భావించారు. కోర్ బృందం పర్యవేక్షణలో, 30 మంది వాలంటీర్లు అవిశ్రాంతంగా పనిచేశారు మరియు ఈ కార్యక్రమం విజయంలో ప్రధాన పాత్ర పోషించారు.
“పుష్ప స్వాగతం నుండి ప్రసాదం యొక్క చివరి పంపిణీ వరకు, ఈ కార్యక్రమం స్కాటిష్-తెలుగు (Scottish-Telugu) సంప్రదాయాలను భక్తి మరియు ఐక్యతతో మిళితం చేసింది” అని వ్యవస్థాపకుడు విజయ్ కుమార్ రాజు ప్యారీ (Vijay Kumar Raju Parri) అభిప్రాయపడ్డారు. జీయర్ స్వామి (Jeeyar Swami) మీద కోదండరావు అయ్యగారి (Kodandaravu Ayyagari) వ్రాసిన పద్యాలను ప్రశంశా పత్రరూపంలో భువన విజయం (Bhuvana Vijayam) సభ్యులు స్వామి వారికి బహూకరించారు.
“ఏడు కొండల (తిరుపతి) (Tirupati) నుండి ఏడు కొండల (ఎడింబర్గ్) (Edinburgh) వరకు” అని భువన విజయం (Bhuvana Vijayam) వారు అందులో పోల్చుతూ ప్రచురించిన తీరు అద్భుతం. “ఇది స్కాట్లాండ్ (Scotland) మరియు బో’నెస్ (Bo’ness) ను రంగులతో నింపిన అద్భుత సంప్రదాయ వేడుక” అని ఒక వీక్షకుడు పలికిన మాట ఈ ఘనతను మరింత విస్మయపరుస్తోంది.