Charlotte, North Carolina: కృష్ణా జిల్లా, పెనమలూరుకు చెందిన ఠాగూర్ మల్లినేని అమెరికాలో స్థిరపడటంతోపాటు అతి పెద్ద తెలుగు సంఘమైన ఉత్తర అమెరికా తెలుగుసంఘం (TANA)లో కీలకపాత్రను పోషిస్తూ వస్తున్నారు. ఇటీవల జరిగిన తానా ఎన్నికల్లో 2025-29 సంవత్సరానికి గాను ఫౌండేషన్ ట్రస్టీగా ఆయన ఎన్నికయ్యారు.
తానా ఫౌండేషన్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో పేదలకు, రైతులకు, విద్యార్థులకు అవసరమైన సహాయాన్ని అందిస్తానని, గతంలో కూడా పెనమలూరుకు ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించానని, ఇప్పుడు ఫౌండేషన్ ట్రస్టీగా పెనమలూరులోని పేదలకు మరింతగా సహాయాన్ని చేస్తానని చెప్పారు.
ఉచిత నేత్ర వైద్య చికిత్స శిబిరాల ఏర్పాటు, విద్యార్థుల చదువుకు స్కాలర్ షిప్ ల పంపిణీ వంటివి చేస్తానని ఆయన హామి ఇచ్చారు. కాగా TANA Foundation Trustee గా ఠాగూర్ మల్లినేని ఆయన ఎంపిక పట్ల పెనమలూరు (Penamaluru) లోని పలువురు సంతోషం వ్యక్తం చేశారు.