డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం విదేశీ సుంకాలపై ఫోకస్ పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో వివిధ దేశాల నుంచి వస్తున్న దిగుమతులపై సహజంగానే ఆరా తీస్తారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా సుంకం చెల్లించకుండా వచ్చే షిప్మెంట్స్ ని మోనిటర్ చేస్తున్నట్లు తెలిసింది.
ఇప్పటి వరకు చిరు వ్యాపారాలు చేసుకునే ప్రవాసులు (NRIs) ఇండియా (India), చైనా (China), హాంకాంగ్ (Hong Kong) వంటి దేశాల నుంచి కొనుగోలు చేసి అమెరికా కి తెచ్చుకొని ఇక్కడ రిటైల్ రేట్లకు అమ్ముతూ ఉండడం జరుగుతూ వస్తుంది. ఇప్పటి వరకు బానే ఉన్నప్పటికీ, ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం వీటిపై కూడా దృష్టి సారించింది.
పన్నులు చెల్లించకుండా అమెరికాకు వచ్చే బట్టలు, నగలు, ఆహార పదార్దాలపై నిఘా పెట్టినట్లు తెలిసింది. ఆన్లైన్ మరియు సోషల్ మీడియా యాప్స్ లో ఈ మధ్యనే ఇలా కొన్న కొంతమంది ఎదుర్కొన్న ఇబ్బందులు వగైరా గురించి సోషల్ మీడియా (Social Media) లో సందేశాలు చక్కెర్లు కొడుతున్నాయి.
ముఖ్యంగా నార్త్ కెరొలినా (North Carolina), చికాగో (Chicago) వంటి ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో పెనాల్టీ విధించినట్లు వినికిడి. వీరు కొన్ని జాతీయ సంస్థల్ని సంప్రదించడంతో ఈ విషయం బయటికొచ్చినట్లు తెలిసింది. దీంతో స్నేహితుల ద్వారా, కుటుంబ సభ్యుల ద్వారా చెక్ ఇన్ లగేజ్ లో తెప్పించుకునే చిన్నాచితకవిషయంలో కూడా అందరూ ఆచితూచి అడుగులేస్తున్నారు.
అనవసరంగా చిన్న చిన్న వి కొని పెద్ద మొత్తంలో పెనాల్టీలు కట్టే పరిస్థితులు మరియు వీసా, గ్రీన్ కార్డు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కంటే జాగ్రత్తగా ఉండడమే నయం. ఎందుకంటే పన్ను ఎగ్గొట్టే విషయం అమెరికాలో పెద్ద నేరం కనుక. అనవసరంగా ఇబ్బందులు కొని తెచ్చుకోకండి. కమ్యూనిటీ అవేర్నెస్ (Community Awareness) కోసం ఈ న్యూస్ ని అందిస్తున్నాము.