Washington, DC: నాలుగు సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి.. యాభై ఏళ్ళ రాజకీయ ప్రజా ప్రాతినిధ్యం. క్రమశిక్షణ, భాష, వ్యవహారిక తీరు. వ్యక్తిత్వంలో తెలుగు జాతినే ప్రభావితం చేసేంత శిఖర సమానులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు.. చరిత్ర మరువని నిత్య కృషీవలుడు, సామాన్యుల కుటుంబాల విద్యార్థుల మేధస్సుకు సాంకేతికతను జోడించి, ప్రపంచ వేదికపై పట్టాభిషేకం చేసిన అసమాన నాయకుడు.
పేదరికంలో ఎదిగి, కష్టపడి చదువుకొని, విద్యాధికుడిగా ఎదిగి, అవకాశాలను అందిపుచ్చుకొని ప్రతి సంక్షోభంలో ఒక అవకాశం ఉందన్న ఆశావాహుడు, స్ఫూర్తిప్రదాత. ఆయన గత పాలనలో చేసిన సంస్కరణల ఫలితంగా.. రెండు దశాబ్దాలుగా క్రితమే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ను సాంకేతిక రంగ రాజధానిగా నిలిపిన స్ఫూర్తి ఫలితమే, ప్రపంచ దేశాలలో అన్ని సాంకేతిక విజ్ఞాన రంగాలలో తెలుగువారే ముందుండటం మీ దార్శనికతకు తార్కాణం, మీరు చేసిన కృషికి నిలువెత్తు నిదర్శనం.