Singapore: తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో ది: 18-జనవరి రోజు నిర్వహించిన ‘మీట్ అండ్ గ్రీట్’ (Meet & Greet) కార్యక్రమం వన్ వరల్డ్ ఇంటర్నేషనల్ (GIIS) స్కూల్ ఆడిటోరియంలో తెలంగాణ (Telangana) రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి (Anumula Revanth Reddy) ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
ఐటీ/ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్/ఇండస్ట్రీస్ & కామర్స్/లెజిస్లేటివ్ అఫైర్స్ మంత్రి వర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, నాగార్జున సాగర్ ఎం ఎల్ ఏ జయవీర్ కుందూరు, తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు/బాన్సువాడ ఎం ఎల్ ఏ/ మాజీ అసెంబ్లీ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి, డిసిసి ప్రెసిడెంట్ డాక్టర్ రోహిణ్ కుమార్ రెడ్డి ని అతిధి మర్యాదలతో తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) వ్యవస్థాపక అధ్యక్షులు బండ మాధవ రెడ్డి , పూర్వ అధ్యక్షులు నీలం మహేందర్, అధ్యక్షులు గడప రమేష్ బాబు , ముఖ్య అతిధులు మరియు సింగపూర్ తెలుగు ప్రజల సమక్షంలో ఆహ్వానించారు. సింగపూర్ తెలుగు ప్రజల మరిచిపోలేని మధుర క్షణాలను మదిలోనింపుకొన్నరోజు.
తెలంగాణ (Telangana) రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి (Anumula Revanth Reddy) జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. చిన్నారుల నృత్యప్రదర్శనతో మరియు స్వాగత గీతంతో ఆహ్వానించారు. తరువాత తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Telangana Cultural Society (Singapore) అధ్యక్షులు శ్రీ గడప రమేష్ (Gadapa Ramesh) స్వాగత ప్రసంగంతో తెలంగాణ కల్చరల్ సొసైటీ స్థాపన మరియు తెలుగు సంప్రదాయాలను, ఆచారాలను, ఆధ్యాత్మిక తత్వాలను భావితరాలకు అందించే కృషిలో సొసైటీ నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించడం జరిగింది.
తెలంగాణ (Telangana) మీద ఉన్నప్రేమను చూపించడానికి విచ్చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి (Anumula Revanth Reddy) కి , IT మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబుకి, రోహిణ్ కుమార్ రెడ్డికి, మరియు ఇతర సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు.
అదేవిధంగా తెలంగాణ కల్చరల్ సొసైటీకి వెన్నంటి ముందుండి నడిపించి తమ సహాయ సహకారాలను ఎళ్లవేళల అందించే వ్యవస్థాపక అధ్యక్షులు బండ మాధవ రెడ్డి కి, పూర్వ అధ్యక్షులు నీలం మహేందర్ కి, NRI Cell మంద భీం రెడ్డి కి, GTA గ్లోబల్ ఛైర్మెన్ శ్రీ కల్వల విశ్వేశర్ రెడ్డి కి, GIIS ఛైర్మెన్ శ్రీ అతుల్ తెముర్ణికర్ కి, శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ కి అంతే కాకుండా ఈ కార్యక్రమానికి సహకరించిన బసిక శ్రీకాంత్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి (Anumula Revanth Reddy) సింగపూర్ లో నివసిస్తున్న తెలుగు ప్రజలను ఉద్దేశించి తెలంగాణలో పలు రంగాలలో చేస్తున్న అభివృద్ధిని మరియు తెలంగాణ ఔన్నత్యాన్ని భావితరాలకు అందించే ప్రణాలికను మరియి ప్రపంచదేశాలు తెలంగాణను తలయెత్తి చూసే సమయం ఆసన్నమయింది అని దానికి విదేశాలలో నివసిస్తున్న మన తెలంగాణ మరియు తెలుగు ప్రజల సహాయ సహకారాలు ఉండాలని తమ అమూల్యమైన సందేశాన్ని తెలియజేసారు.
అదేవిధంగా IT మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు, డిజిటల్ రంగంలో చేస్తున్న అభివృద్ధిని వివరించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి (Anumula Revanth Reddy) ని, IT మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు ని, ఇతర మంత్రివర్గ సభ్యులను మరియు అతిదులందర్నీ తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) కమిటి, శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ మరియు GIIS ఛైర్మెన్ అతుల్ తెముర్ణికర్ ఘనంగా సత్కరించారు.
ఈ వేడుకల్లో మాతృశ్రీసాయి ఇన్స్టిట్యూట్, సర్వ ఫైన్ ఆర్ట్స్, దుర్గ శర్మ గ్రూప్, దీపారెడ్డి అండ్ గ్రూప్ మరియు స్వర్ణకళామందిర్ నుండి చిన్నారుల నృత్యప్రదర్శనలు, మధురమైన గీతాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి కాసర్ల శ్రీనివాస రావు మరియు మిర్యాల సునిత రెడ్డి ముఖ్య సమన్వయ కర్తలుగా వ్యవహరించి అందరిని అలరించారు.
కార్యక్రమంలో భాగంగా Telangana Cultural Society (Singapore) వ్యవస్థాపక అధ్యక్షులు బండ మాధవ రెడ్డి (Banda Madhava Reddy), పూర్వ అధ్యక్షులు నీలం మహేందర్ (Neelam Mahendar) మరియు శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షలు రత్న కుమార్ కవుటూరు మరియు తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) సభ్యుల చేతుల మీదుగా 2025 తెలుగు క్యాలెండర్ (సింగపూర్ కాలమాన ప్రకారం) ను విడుదల చేసి సభ్యులకు మరియు హాజరైన వారికి పంపిణీ చేసి సంతోషం వ్యక్తపరిచారు.
Telangana Cultural Society (Singapore) ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి కి, IT మినిస్టర్ శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు కి, ముఖ్య అతిధులకు, ఇతర అనుబంధ సంస్థలకు, కార్యక్రమ ఏర్పాటులో తోడ్పడిన సొసైటీ సభ్యులు ఆలెక్స్ తాళ్ళపల్లి, మల్లారెడ్డి కళ్లెం, లక్ష్మణ్ రాజు కల్వ, రాకేష్ రెడ్డి రజిది, సురేందర్ రెడ్డి గింజల మరియు సింగపూర్ తెలుగు ప్రజలకు అభినందనలు తెలియజేసారు.
ఈ సందర్భంగా ప్రతిఒక్కరికి Telangana Cultural Society (Singapore) అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల మరియు కోశాధికారి నంగునూరి వెంకట రమణ , సొసైటీ ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, జూలూరి సంతోష్ కుమార్ ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు శుభాకాంక్షలు తెలియజేసారు.
ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, నడికట్ల భాస్కర్, శశిధర్ రెడ్డి, రవి కృష్ణ విజాపూర్,సంతోష్ వర్మ మాదారపు మరియు కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి మరియు చల్ల కృష్ణ మొదలగు వారు ‘మీట్ అండ్ గ్రీట్’ కు హాజరైన ప్రతిఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసారు.
వీరితో పాటు Telangana Cultural Society (Singapore) మహిళా విభాగ సభ్యులు గడప స్వాతి, బసిక అనిత రెడ్డి, జూలూరు పద్మజ, సునీత రెడ్డి, హేమ లత, దీప నల్ల,కాసర్ల వందన, బొందుగుల ఉమా రాణి, నంగునూరు సౌజన్య, నడికట్ల కళ్యాణి, హరిత విజాపుర్, ఆవుల సుష్మ, పులిగిల్ల హరిత, సౌజన్య మాదారపు, ఎర్రమ రెడ్డి దీప్తి, సృజన వెంగళ, హర్షిణి మామిడాల, సుధా రాణి పెసరు, వాసవి పెరుకు, రావుల మేఘన మరియు చల్ల లత మొదలగు వారు మీట్ అండ్ గ్రీట్ (Meet & Greet) విజయవంతం కావడం లో కీలక పాత్ర పోషించడం జరిగింది.