Atlanta, Georgia: వాసవి సేవా సంఘ్ (Vasavi Seva Sangh) వాసవి మాత ఆదర్శాలతో స్థాపించిన సేవ సమస్తా, ధర్మం, శీలం మరియు అహింస మార్గాలను ఎంచుకొని ఆధునిక సమాజ స్థాపనకు తోడ్పడుతున్న సేవా సమస్త సమాజంలో బడుగు, బలహీన వర్గాలు అది కులాలకు సంబంధం లేకుండా, మతాలకు సంభందం లేకుండా, దేశాలకు సంభందం లేకుండా నవ సమాజ స్థాపన కొరకు కంకణం కట్టుకొన్న ఏకైక సేవా సంస్థ. “వసుధైక కుటుంబమే వాసవి సేవా సంఘ లక్ష్యం”.
దైవ చింతన మరియు సేవా తత్పరనే మార్గంగా ఎంచుకొని అన్నదాన కార్యక్రమాలు (Food Donation), ఆర్తులకు దుప్పట్ల పంపిణి (Blankets Donation), రక్త దానం (Blood Donation), విద్య దానం (Education Support) మరియు మహిళా సాధికారత కొరకు కృషి చేస్తున్న ఏకైక సేవా సంస్థ గా వాసవి సేవా సంఘ్ (Vasavi Seva Sangh) ను తీర్చి దిద్దడానికి నిరంతర సాధన జరుగుతుంది. దీనికి మీ అందరి సహాయ సహకారాన్ని అందించమని వాసవి సేవా సంఘ్ వేడుకొంటోంది.
భావ ప్రధానమైన వ్యక్తులతో పనిచేయడానికి (Vasavi Seva Sangh – VSS) ఎప్పుడు సహాయ హస్తాలను అందించడానికి కార్య నిర్వాహక వర్గం ఎదురు చూస్తూ ఉంటుంది. సేవా కార్యక్రమాలతో పాటుగా మన సంస్కృతి సంప్రదాయాలను మన భవిష్యత్తు తరాలకు అందించడం కోసం, సంక్రాంతి (Sankranti) సంబరాలు, వాసవి జయంతి, మహిళా దినోత్సవం, సమ్మర్ పిక్నిక్, దసరా సంబరాలు మరియు పురుషుల సాధికారిక దినోత్సవ కార్యక్రమాలు జరుపు కోవడం జరుగుతుంది.
2017 లో ప్రశాంత్ ప్రొద్దుటూరు, సాగర్ కోటికే, రమేష్ మేడా, రాజేష్ చప్పరపు, కృష్ణ కొనకండ్ల, శ్రీని బుక్క మరియు మహేష్ కొప్పు గారి ఆధ్వర్యంలో రూపు దిద్దుకున్న ఈ సేవా సమస్త వివిధ దశల్లో ఎన్నో సేవా కార్య్కర్మాలు చేపట్టి ఎంతో మందికి సహాయం చేయడం జరిగింది. మా ఈ సేవా మార్గములో మరెందరో సహకరించారు. వారందరికీ హృదయ పూర్వక మనసుమాంజలులు సమర్పించు కుంటోంది వాసవి సేవా సంఘ్ (Vasavi Seva Sangh).
నూతన కార్య వర్గం: ఆధునిక యువత ఎప్పుడు కూడా దూకుడుగా ఆదర్శనీయమైన మార్గంలో నడిస్తే ఏ సమస్త అయినా అభివృద్ధి అనేది చిటికెలో సాధ్యమవుతుంది, అదే సేవా తత్పరతతో పని చేయడానికి కొత్త కార్యవర్గం (New Leadership) ఎన్నుకో బడింది.
స్టీరింగ్ కమిటీ సభ్యులు
శ్రీ నవీన్ బుడ్డా గారు
శ్రీ ఫణి కుమార్ మేడా గారు
శ్రీ సాధన కల్లూరి గారు
ఆధ్వర్యములో శ్రీ రాజేష్ కాకరపర్తి గారు (సేవా కమిటీ ) శ్రీ బ్రహ్మష్ నూకల గారు / ప్రశాంత్ భారతం (ఇంటెర్నేషన్ కోఆర్డినేటర్) శ్రీ లక్ష్మి నారాయణ గారు (పబ్లిక్ రిలేషన్స్) శ్రీ నాగరాజు వెల్లంపల్లి గారు (సోషల్ మీడియా) శ్రీ రామకృష్ణ గొంట్లా గారు (వెండార్స్& స్పాన్సోర్షిప్స్) శ్రీ రాము సంఖ్య గారు (టెక్నాలజీ కమిటీ) శ్రీ సాహితి వెలంపల్లి గారు (కల్చరల్ కమిటీ) శ్రీ వాసవి చిత్తకూరి గారు (పూజ కమిటీ) శ్రీ విశాల్ కల్లూరి గారు రిజిస్ట్రేషన్ మెంబెర్షిప్స్) శ్రీ గోపి కృష్ణ గజవల్లి గారు (ఫండ్ రైసింగ్) శ్రీ కార్తీక్ వెంపటి గారు (స్పోర్ట్స్ &హెల్త్) శ్రీ పావని గారు (పూజ & కల్చరల్) శ్రీ శరత్ టాటా గారు (బ్లడ్ డొనేషన్స్ కమిటీ )
వీరి ఆధ్వర్యంలో వాసవి సేవా సంఘ్ (Vasavi Seva Sangh) మరిన్ని సేవా శిఖరాలను అందుకోబోతోంది. బోర్డ్ కార్యవగా సభ్యులు కూడా ఎంతో మంది ముందుకి వచ్చి వాసవి సేవా సంఘ్ ను ఆర్ధికంగానూ నిలదొక్కు కోవడాని సహాయ సహకారాలు అందించారు మరియు భవిషత్తు సేవా సిఖరంగా అన్ని అమెరికా లోని అన్ని రాష్ట్రాలలో వాసవి సేవా సంఘ్ నెల కొల్పడానికి కృషి జరుగుతుంది అని సౌగౌరవంగా తెలియ చేస్తున్నాము.