Philadelphia, Pennsylvania: భాషే రమ్యం.. సేవే గమ్య అని నినదించే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (North America Telugu Society) ‘నాట్స్’ తన సేవా భావాన్ని మరోసారి చాటింది. ఫిలడెల్ఫియాలో నాట్స్ విభాగం స్థానిక సెంట్రల్ బక్స్ సౌత్ హైస్కూల్ (Central Bucks High School South) కి ఆరు వేల డాలర్లను విరాళంగా అందించింది. నాట్స్ ఫిలడెల్ఫియా విభాగం ఈ చెక్కును సెంట్రల్ బక్స్ సౌత్ హైస్కూల్ ప్రిన్సిపల్ జాసన్ హెచ్ బుచర్ (Jason H. Bucher) కు అందించారు.
నాట్స్ (NATS) అందించిన విరాళం ద్వారా సెంట్రల్ బక్స్ సౌత్‌లో కార్యకలాపాలను మరింత ముమ్మరంగా చేయనుంది. నాట్స్ పూర్వ చైర్మన్ శ్రీధర్ అప్పసాని (Sreedhar Appasani), నాట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ హరినాథ్ బుంగటావుల (Harinath Bungatavula), నాట్స్ బోర్డు సభ్యుడు వెంకట్, నాట్స్ జాతీయ కార్యక్రమాల సమన్వయకర్త రమణ రకోతు, నాట్స్ యూత్ సభ్యురాలు అమృత శాఖమూరి ఈ విరాళాన్ని అందించిన వారిలో ఉన్నారు.
నాట్స్ ఫిలడెల్ఫియా విభాగం (NATS Philadelphia Chapter) చేసిన దాతృత్వం సమాజంలో సేవా స్ఫూర్తిని నింపుతుందని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni) అన్నారు. నాట్స్ ఫిలడెల్ఫియా సభ్యులను నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి (Madan Pamulapati) అభినందించారు.