Cary, North Carolina: అమెరికాలోని పలు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (Andhra Pradesh American Association – AAA) చాఫ్టర్స్ ఏర్పాటు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో ప్రతి చాప్టర్ కూడా పెద్ద ఎత్తున సేవ, సాంస్కృతిక కార్యక్రమాలు చేయడానికి ప్రణాళికలు రచించాయి.
ఇందులో భాగంగా AAA ర్యాలీ చాప్టర్ (Raleigh Chapter) మొట్టమొదటి కార్యక్రమం ‘సంక్రాంతి సంబరాలు 2025’ జనవరి 18, వచ్చే శనివారం రోజున సాయంత్రం 4 గంటల నుండి నార్త్ కరోలినా రాష్ట్రం (North Carolina), కేరీ(Cary) పట్టణంలోని గ్రీన్ లెవెల్ హై స్కూల్ లో నిర్వహిస్తున్నారు.
పెద్ద ఎత్తున నిర్వహించనున్న ఈ సంక్రాంతి సంబరాలలో తెలుగు సినీ సంగీత దర్శకులు మణిశర్మ (Music Director Mani Sharma) ఆధ్వర్యంలోని పలువురు గాయనీగాయకులు సంగీత విభావరి (Musical Concert) తో అందరినీ అలరించనున్నారు. మరిన్ని వివరాలకు ఫ్లయర్స్ చూడండి.
AAA (Andhra Pradesh American Association) ర్యాలీ చాప్టర్ ప్రెసిడెంట్ లెనిన్ బాబు మాదల (Lenin Babu Madala) సారధ్యంలోని ర్యాలీ చాప్టర్ బృందం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి RSVP తప్పనిసరి. RSVP చేసుకున్నవారికి 45 కి పైగా ఆంధ్ర స్పెషల్ వంటకాలతో ఉచిత పండుగ భోజనం అందించనున్నారు.
ఇందేందుకు ఆలస్యం! ఎంతోప్రాధాన్యతను సంతరించుకున్న ఈ ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ ర్యాలీ చాప్టర్ (AAA Raleigh Chapter) మొట్టమొదటి సంక్రాంతి సంబరాలు 2025 ఈవెంట్ కి తప్పకుండా హాజరవ్వండి.