Dallas, Texas: టెక్సాస్ రాష్ట్రం లోని డల్లాస్ నగరంలో దేశీ చౌరస్తా (Desi Chowrastha) ఇండియన్ గ్రాసరీస్ వారిని తూనికల విషయంలో తేడాలు ఉన్నాయంటూ $100,000 డిమాండ్ చేస్తూ తెలుగువారే బ్లాక్ మెయిల్ చేశారని రెండు వారాల క్రితం పలు మీడియాలలో (NRI2NRI.COM కాదు) కధనాలు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.
కాకపోతే అదందా పూర్తిగా నిజం కాదని, ఏవో వ్యాపార సంబంధ విషయాలలో తేడాలు రావడంతో స్టింగ్ ఆపరేషన్ అంటూ తెరమీదకు తెచ్చి దేశీ చౌరస్తా (శరత్ పొద్దుటూరి) వారు మొత్తం కథని పక్కదారి పట్టించి రక్తి కట్టించారని అంటున్నారు రోహిత్ ఉప్పల. దేశీ చౌరస్తా తూనికలలో తేడాలు మాత్రం నిజమేనని, ఆ విషయం వారు పోలీసుల ముందు కూడా ఒప్పుకున్నట్లు వాపోతున్నారు.
అంతకు ముందు దేశీ చౌరస్తా (Desi Chowrastha) లో భాగస్వామ్యం కోసం Rohith Uppala పెద్ద మొత్తం దేశీ చౌరస్తా (Sarath Podduturi) వారికి ఇచ్చినట్లు, కానీ పార్ట్నర్షిప్ ఇవ్వకుండా చానాళ్ల తర్వాత డబ్బులు తిరిగి ఇచ్చే క్రమం లోనే దేశీ చౌరస్తా తూనికలలో తేడాలు కనుగొన్నట్లు, దీంతో అందరూ కలిసి సెటిల్మెంట్ మీటింగ్ కి కూర్చున్నట్లు చెబుతున్నారు.
ఆ తదనంతర పరిస్థితులను మీడియా (NRI2NRI.COM కాదు) గుడ్డిగా ఒక వైపు స్టోరీనే ప్రచురించిందని వాపోతున్నారు. ఈ విషయంలో పోలీసులు (Police) ఎవరినీ అరెస్టు చేయలేదని అన్నారు. మీడియా కూడా అత్యుత్సాహం ప్రదర్శించకుండా, నిజానిజాలు తెలుసుకోవాలని హితవు పలికారు.
మొత్తంగా చూస్తే ఈ వెర్షన్ లో కూడా నిజానిజాలు ఆ దేవుడికే తెలియాలని, బిజినెస్ గొడవలను సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిందిగా, తెలుగు (Telugu) వారి పరువుని అమెరికా బజారుల్లో దిగజార్చకుండా చూసుకోండంటూ స్థానిక డల్లాస్ (Dallas) తెలుగువారు కోరుతున్నారు.