Connect with us

Devotional

PoTA ఆధ్వర్యంలో కమనీయంగా దేవదేవుడు శ్రీ శ్రీనివాస కళ్యాణం @ Poland

Published

on

పోలాండ్‌ (Poland) లో ఇటీవల తెలుగు సంస్కృతి (Culture), ఆధ్యాత్మికత (Spirituality) ప్రతిఫలించిన ఒక గొప్ప కార్యక్రమం జరిగింది. పోలాండ్‌ లోని వార్సా (Warsaw) లో దేవదేవుడైన శ్రీ శ్రీనివాస కళ్యాణం (Sri Srinivasa Kalyanam) మునిపెన్నడు లేని విధంగా నిర్వహించారు.

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెన్ తెలుగు సొసైటీ (APNRTS) సహకారంతో, Poland Telugu Association (PoTA) వారి ఆధ్వర్యంలో శ్రీదేవి , భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి (Lord Venkateswara Swamy) వారి కళ్యాణం కన్నుల పండుగగా శనివారం, నవంబర్ 30 2024న చోపిన్ (Chopin) ఆడిటోరియంలో జరిగింది.

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నుండి వచ్చిన అర్చకులు (Priests), వేద పండితులు (Vedic Scholars) కళ్యాణాన్నివైఖానస ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. కళ్యాణోత్సవ క్రతువు కార్యక్రమం సుప్రభాత సేవతో ప్రారంబించి పుణ్యవచనం, విశ్వక్సేన ఆరాధన, అంకురార్పణ, మహాసంకల్పం, కన్యాదానం, మాంగళ్యధారణ, వారణ మాయిరం  హారతితో శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవం నిర్వహించారు.

కార్యక్రమానికి  భారత రాయబారి (Indian Ambassador) శ్రీమతి నగ్మా మల్లిక్ (Nagma Mallick) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వారితో పాటు సుమారు 700 భక్తులు హాజరై కళ్యాణ ఘట్టాన్ని  ప్రత్యక్షంగా తిలకించి కన్నులు పండుగల తరించారు భక్తులందరికీ తిరుమల (Tirumala) నుండి తెచ్చిన లడ్డు ప్రసాదం అందించడం జరిగింది.

పోలాండ్ (Poland) లో ఉన్న బారతీయులందరికి  కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి (Lord Venkateswara Swamy) వారి ఆశీస్సులతో పాటు ఆధ్యాత్మిక భావాన్ని కల్పించడమే ప్రధాన ఉద్దేశం గా స్వామివారి వేడుకలను Poland Telugu Association (PoTA) వారు నిర్వహించారు.

ప్రాంగణమంతా గోవింద (Govinda) నామ స్మరణ (Name Remembrance) తో మారుమోగిపోయింది రోజంతా తిరుమల కొండ (Tirumala Hill) పై ఉన్నామా అన్న అనుభూతిని కలిగిందని భక్తులు (Devotees) పెద్దలు  నిర్వాహకులుకు స్వయంగా తెలియచేసారు.

టిటిడి (TTD) కళ్యాణ కార్యనిర్వాహకవర్గం సభ్యులైన శ్రీ బాలాజీ ప్రసాద్ (Balaji Prasad) గారు, PoTA ప్రెసిడెంట్ చంద్ర భాను ఆక్కల (Chandra Bhanu Akkala) మరియు వారి కోర్ కొమిటి అలాగే  స్వచ్చందంగా విచ్చేసిన వాలంటీర్ల (Volunteers) సహకారంతో స్వామివారి కల్యాణోత్సవం (Wedding Ceremony) సజావుగా సాగేలా సమన్వయం చేశారు.

యూకే (United Kingdom) అండ్ యూరప్ (Europe) లో  శ్రీవారి కళ్యాణం (Srivari Kalyanam) తిరుమల దేవస్థానం (TTD) వారి ఆధ్వర్యంలో 13 నగరాల్లో శ్రీనివాస కళ్యాణం (Srinivasa Kalyanam) 9th నవంబర్ నుంచి 21st డిసెంబర్ వరకు  నిర్వహిస్తున్న విషయం విదితమే. 

error: NRI2NRI.COM copyright content is protected