కాటగానికాలువ, అనంతపూర్, ఆంధ్రప్రదేశ్, నవంబర్ 25: వికలాంగులకు అండగా నిలవాలనే సంకల్పంతో కృషి చేస్తున్న అమెరికా లోని హోఫ్4స్పందన సేవా సంస్థ తెలుగునాట వేల మంది వికలాంగులకు సాయం అందిస్తుంది. ఈ క్రమంలోనే అనంతపురం (Anantapur, Andhra Pradesh) లోని కాటగానికాలువ గ్రామంలో ఆశ్రయ అనాధశ్రమానికి (Orphanage) హోఫ్4 స్పందన అండగా నిలిచింది.
ఈ ఆశ్రమంలో అనాధ మానసిక వికలాంగులకు శాశ్వత నివాసం కల్పించేందుకు కావాల్సిన ఆర్ధిక సహకారాన్ని అందించింది. అమెరికాలో తెలుగువారికి అండగా నిలిచే ఉత్తర అమెరికా తెలుగు సంఘం NATS, ఏకాంశ సంస్థలు ఈ సత్కార్యానికి సాయం చేశాయి. హోఫ్4 స్పందన (Hope4Spandana) నిర్వాహకులు లక్ష్మీ నరసింహం కోట తాజాగా అనంతపురంలోని ఆశ్రయ అనాధశ్రమం కోసం నిర్మిస్తున్న శాశ్వత షెల్టర్‌ను పరిశీలించారు.
దాదాపు 70 శాతం పూర్తయిన ఈ షెల్టర్ అనాధ మానసిక వికలాంగులకు ఆవాసంగా మారనుంది. సమాజ సేవ కోసం హోఫ్4 స్పందన పిలుపుతో స్పందించి సాయం చేసిన నాట్స్, ఏకాంశ సంస్థలకు లక్ష్మీ నరసింహ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni), నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి (Madan Pamulapati) తో పాటు హోఫ్4 స్పందన ఆశయ సిద్ధికి అండగా నిలిచిన నాట్స్ నాయకులు శ్రీధర్ అప్పసాని (Sreedhar Appasani), మురళీకృష్ణ మేడిచెర్ల (Murali Medicherla) లకు ధన్యవాదాలు తెలిపారు.
25 ఏళ్లుగా అనాధ మానసిక వికలాంగుల కోసం ఆశ్రయ అనాధశ్రమం ద్వారా కృషి చేస్తున్న కృష్ణారెడ్డి సేవలు అభినందనీయమని లక్ష్మీ నరసింహ అన్నారు. వందమందికిపైగా మానసిక వికలాంగులకు (Mentally Handicapped Orphans) ఈ కొత్త షెల్టర్ ఉపయోగపడనుంది.