Connect with us

Movies

‘గాంధీ తాత చెట్టు’ తెలుగు సినిమా ఉచిత ప్రదర్శన @ Dallas, Texas

Published

on

“గాంధీ తాత చెట్టు” అనే తెలుగు సినిమా నిర్మాత శేష సింధూ రావు (Seshu Sindhu Rao), తెలుగు-ఇండి ఫిల్మ్ సంధాత డాన్జీ తోటపల్లి, ఫెస్టివల్ డైరెక్టర్ క్రిస్టియన్ ఫ్రాస్ట్ అమెరికా దేశంలోనే అతి పెద్దదైన డాలస్ (Dallas) లో నెలకొనియున్న మహాత్మాగాంధీ మెమోరియల్ (Mahatma Gandhi Memorial) ను సందర్శించి బాపూజికి ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మహాత్మాగాంధీ మెమోరియల్ (Mahatma Gandhi Memorial) వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర (Dr Prasad Thotakura) మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ సిద్ధాంతాలను, ఆశయాలను ఒక బాలిక ద్వారా చెప్పించడం భావితరాలకు వారధిగా నిలిచే ఒక గొప్ప సందేశం ఈ చలనచిత్రంలో ఇమిడి ఉందని, ప్రస్తుత పరిస్థితులలో ఇలాంటి సినిమా (Cinema) తీయాలనే తలంపు రావడం అభినందనీయం అంటూ సినీ నిర్మాత, దర్శకులకు శుభాకాంక్షలు అందజేశారు.

ఈ చలనచిత్ర నిర్మాత శేష సింధూరావు (Sesha Sindhu Rao ), తెలుగు ఇండిక్ ఫిల్మ్ సంధాత డాన్జీ తోటపల్లి, ఫిల్మ్ ఫెస్టివల్ డైరెక్టర్ క్రిస్టియన్ ఫ్రాస్ట్ లు మాట్లాడుతూ ఈ సినిమాలో ప్రముఖ దర్శకులు సుకుమార్ (Movie Director Sukumar) కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి పోషించిన పాత్ర అందరినీ ఆకట్టుకుంటుందని, ఈ చిత్రనిర్మాణంలో ప్రముఖ చలనచిత్ర నిర్మాణసంస్థ మైత్రీ మూవీ మేకర్స్, ప్రముఖ దర్శకులు సుకుమార్ అందించిన సహకారం వెలకట్టలేనిది అన్నారు.

ఈ “గాంధీ తాత చెట్టు” (Mahatma Gandhi) అనే తెలుగు సినీమాను గాలాక్సీ యట్ గ్రాండ్ స్కేప్, ది కాలనీ లో నవంబర్ 16, శనివారం సాయంత్రం 6 గంటలకు ఉచితంగా ప్రదర్శిస్తున్నట్లు, ఆసక్తి ఉన్నవారు [email protected] కు email చేసి తమ టికెట్లను పొందవచ్చు అన్నారు.

మహాత్మాగాంధీ మెమోరియల్ (Mahatma Gandhi Memorial) వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, కార్యదర్శి రావు కల్వల, గవర్నింగ్ బోర్డు సభ్యులు అనంత్ మల్లవరపు చలనచిత్ర సిబ్బందిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డి. శ్రీనివాస్, ఎ.కె నాయుడు మరికొంతమంది ప్రవాస భారతీయులు పాల్గొన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected