Connect with us

Financial

ఆర్ధిక ఇబ్బందులను అధిగమించేలా అవగాహన సదస్సు: NATS Los Angeles Chapter

Published

on

Los Angeles, California: అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం NATS తాజాగా ఆన్‌లైన్ వేదికగా ఆర్ధిక అక్షరాస్యత (Financial Literacy) పై అవగాహన సదస్సు నిర్వహించింది. నాట్స్ మహిళా సాధికారత జాతీయ సమన్వయకర్త రాజలక్ష్మి చిలుకూరి (Rajalaxmi Chilukuri ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సుకు మంచి స్పందన లభించింది.

ఆర్ధిక ప్రణాళిక ఎలా ఉండాలి.? ఆర్ధిక అంశాల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి.? ఆర్ధిక పరమైన ఇబ్బందులను అధిగమించే మార్గాలు ఏమిటి.? ఇలాంటి ఎన్నో అంశాలను ఆ సదస్సు ద్వారా అవగాహన కల్పించారు. వర్జీనియా (Virginia) కు చెందిన ఆర్థిక నిపుణులు శ్రీలత గూడూరు, ఆదాయాలు ఎలా పెంచుకోవాలి., అప్పులు, ఆదాయ వనరులు, రిటైర్‌మెంట్ ప్లానింగ్, బేసిక్ మనీ మేనేజ్‌మెంట్ (Money Management) వంటి వివిధ అంశాలపై సవివరంగా ఈ సదస్సులో వివరించారు.

నెట్‌ లా (Net Law) సంస్థ వైస్ ప్రెసిడెంట్ మార్క్ స్టిర్నెమాన్ వీలునామాలు, ట్రస్ట్‌ల యొక్క ప్రాముఖ్యతను వివరించడంతో పాటు ఇక్కడ డాక్యుమెంటేషన్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా తెలిపారు. సదస్సులో పాల్గొన్న వారి ఆర్ధిక సందేహాలను నివృత్తి చేశారు. ఈ సదస్సుకు శ్రీనివాస్ చిలుకూరి (Srinivas Chilukuri) అనుసంధానకర్తగా వ్యవహరించారు.

ఆర్ధిక అవగాహన సదస్సును విజయవంతం చేయడంలో కృషి చేసిన నాట్స్ (NATS) వెబ్, మార్కెటింగ్ బృందాలు, నాట్స్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ రాజేష్ కాండ్రుతో లాస్ ఏంజిల్స్ నాట్స్ టీం సభ్యులందరికి నాట్స్ నాయకత్వం కృతజ్ఞతలు తెలిపింది. ఈ సదస్సుకు సహకరించిన నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni), నాట్స్ ప్రెసిడెంట్‌ మదన్ పాములపాటి (Madan Pamulapati) కి నాట్స్ లాస్ ఏంజిల్స్ టీం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.

error: NRI2NRI.COM copyright content is protected