Connect with us

Sports

ఉత్తేజకరమైన క్రీడా వాతావరణంలో TANA Pickleball Tournament @ Cary, North Carolina

Published

on

ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ర్యాలీ చాప్టర్ (TANA Raleigh Chapter) ఎప్పటికప్పుడు సరికొత్త కార్యక్రమాలతో ముందుకు సాగుతుంది. ఈ మధ్యకాలంలో అమెరికా అంతటా అత్యంత ప్రాచుర్యం పొందుతున్న ఆట పికిల్ బాల్ (Pickleball). పిల్లలు, పెద్దలు, మహిళలు చాలా ఇష్టంగా ఆడుతున్న ఆట ఈ పికిల్ బాల్.

ఈ విషయాన్ని గమనించిన ఆపలాచియన్ రీజినల్ కోఆర్డినేటర్ రాజేష్ యార్లగడ్డ (Rajesh Yarlagadda) ఆధ్వర్యంలోని తానా ర్యాలీ చాప్టర్ మొట్టమొదటిసారి పికిల్ బాల్ టోర్నమెంట్ కి శ్రీకారం చుట్టింది. పురుషుల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో, వివిధ ప్రావీణ్య తరగతులలో పికిల్ బాల్ టోర్నమెంట్ (Pickleball Tournament) నిర్వహించారు.

విశేష స్పందన లభించిన ఈ టోర్నమెంట్‌కు ఆర్ట్ కేటరర్స్ (Art Caterers) మరియు ఇండియా కాంటీన్ (Indian Canteen) వారు స్పాన్సర్స్ గా వ్యవహరించారు. టోర్నమెంట్ నిర్వహణ, లాజిస్టిక్స్, సమన్వయం, వెన్యూ, మద్దతుకు సంబందించిన విషయాలలో వంశీ కట్టా, వంశీ బొట్టు, రమేష్ తుమ్మలపల్లి మరియు తానా స్పోర్ట్స్ సెక్రటరీ నాగ పంచుమర్తి కీలకంగా వ్యవహరించారు.

ఈ సందర్భంగా ఆపలాచియన్ (Appalachian Region) ప్రాంత రీజినల్ కోఆర్డినేటర్ రాజేష్ యార్లగడ్డ మాట్లాడుతూ… ప్రవాసులలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు తానా ర్యాలీ చాప్టర్ (TANA Raleigh Chapter) ఎప్పుడూ ముందే ఉంటుందన్నారు. ముఖ్యంగా తెలుగువారిని కలిపేందుకు ఇలాంటి ఆటల పోటీలు (Sports) దోహదం చేస్తాయని అన్నారు.

అలాగే ఉత్తేజకరమైన క్రీడా వాతావరణానికి కారకులైన ఈ పికిల్ బాల్ టోర్నమెంట్ (Pickleball Tournament) విజేతలకు, రన్నరప్స్ కు మరియు పాల్గొన్నవారికి అభినందనలు తెలిపారు. ర్యాలీ ప్రాంత తానా శ్రేయోభిలాషుల మద్దతు, ప్రోత్సాహంతోనే ఇటువంటి కార్యక్రమాల నిర్వహణ సాధ్యమవుతుందని అన్నారు.

ఈ క్రీడా పోటీలను (Pickleball Tournament) సజావుగా నిర్వహించిన విజయంలో సింహ భాగం ఎప్పటిలానే అంకితభావంతో పనిచేసిన మిథున్ సుంకర, వినోద్ కాట్రగుంట, వెంకట్ పసుమర్తి, రవి దర్శి, సుమంత్, ధనుంజయ్, భరత్, కిరణ్ తాళ్లూరి తదితర వాలంటీర్లకే (Volunteers) చెందుతుంది.

క్యారీ (Cary, North Carolina) పట్టణంలోని మెక్గ్రెగర్ డౌన్స్ కంట్రీ క్లబ్ (MacGregor Downs Country Club) కూడా ఈ టోర్నమెంట్ కి చక్కని వేదికయ్యింది. అక్టోబర్ 6 ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు రోజంతా నిర్వహించిన ఈ పికిల్ బాల్ టోర్నమెంట్ విజేతలకు, రన్నరప్స్ కు బహుమతులు, ట్రోఫీలు అందజేశారు.

error: NRI2NRI.COM copyright content is protected