పోలాండ్‌కి 45 సంవత్సరాల తర్వాత విచ్చేసిన భారత ప్రధానమంత్రి శ్రీ. నరేంద్ర మోదీ గారి (Narendra Modi) చారిత్రాత్మక పర్యటన సందర్భంగా, ఆగస్టు 21వ తేదీ బుధవారం నాడు వార్సా (Warsaw, Poland) లో కొంతమంది భారతీయులను కలిశారు.
ఈ సందర్భంగా పోలాండ్ తెలుగు అసోసియేషన్ (PoTA) వ్యవస్థాపకులు శ్రీ చంద్ర భాను అక్కల, శ్రీ హరిచంద్ కాట్రగడ్డ గారి నేతృత్వంలో PoTA బృందం వారికి ఘనస్వాగతం పలకటం ఒక చారిత్రాత్మకమైన అధ్యాయం.పోలాండ్ లో ఉన్న తెలుగువారికి అండగా నిలబడటానికి ఆవిర్భవించిన PoTA ద్వారా, ఆ దేశంలో నివసిస్తున్న తెలుగు వారందరికీ దక్కిన గౌరవంగా దీన్ని భావించవచ్చు.
పోలాండ్ (Poland) లోని భారత రాయబార కార్యాలయం దృష్టిలో PoTA కు ఉన్న గౌరవం, సంవత్సర కాలంగా తెలుగువారికి చేస్తున్న సేవలకు గుర్తింపుగా మరియు వారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ప్రధాన మంత్రి (Narendra Modi) వ్యక్తిగతంగా అభినందనలు తెలిపి, ఇలాగే భవిష్యత్తులో తెలుగు వారికి మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షిచారు.
అలాగే ఆరోజు జరిగిన చిరస్మరణీయ సమావేశాలలో PoTA బృందం మొత్తం భాగం అయినందుకు, PoTA ఈ మరపురాని అనుభూతిని, అవకాశాన్ని అందించినందుకు, పోలాండ్‌లోని భారత రాయబారి శ్రీమతి. నగ్మా మల్లిక్ గారికి PoTA వ్యవస్థాపకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే భవిష్యత్తులో తెలుగు వారికి మరిన్ని సాంఘిక, సంక్షేమ కార్యక్రమాలను, సేవాదృక్పధం అనే బాటలో పయనిస్తు Poland Telugu Association (PoTA) ని ప్రతిష్టాత్మకమైన అసోసియేషన్ గా తీర్చిదిత్తుతానని మీడియా పాయింట్ లో ప్రెసిడెంట్ చంద్ర భాను గారు తెలిపారు.