Connect with us

Education

వట్లూరులో కంప్యూటర్ శిక్షణ కేంద్రం, NATS సేవలను ప్రశంసించిన చింతమనేని

Published

on

అమెరికాలో తెలుగువారికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం NATS ఇటు తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు ముమ్మరంగా చేస్తుండటం అభినందనీయమని దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఏలూరు జిల్లా వట్లూరు గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్‌లో నాట్స్ ఏర్పాటు చేసిన కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభోత్సవంలో చింతమనేని (Chintamaneni Prabhakar) పాల్గొన్నారు.

అమెరికాలో ఉంటూ ఇక్కడ తమ స్వగ్రామం మేలు కోసం తపించే భాను ప్రకాశ్ ధూళిపాళ్ల లాంటి వారు నిజంగా నేటి యువతరానికి స్ఫూర్తి దాయకంగా నిలుస్తారని ప్రశంసించారు. వట్లూరు గ్రామంలో విద్యార్ధులకు ఉపయోగపడేలా కంప్యూటర్ శిక్షణ కేంద్రం (Computer Training Center) ఏర్పాటుకు చొరవ చూపిన భాను ప్రకాశ్‌ని అభినందించారు. ఈ కార్యక్రమంలో 200 మందికి పైగా విద్యార్ధులు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

నాట్స్ (NATS), గ్లో, ఏలూరు రూరల్ లయన్స్ క్లబ్‌లు సంయుక్తంగా ఏర్పాటు చేసిన నాట్స్ కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని రాధాకుమారి, చింతమనేని ప్రభాకర్‌లు ప్రారంభించారు. నాట్స్ బోర్డ్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి (Madan Pamulapati) ల సహకారంతో నాట్స్ వైస్ ప్రెసిడెంట్ భాను ప్రకాశ్ ధూళిపాళ్ల వట్లూరు గ్రామంలో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ఏర్పాటు అయింది.

చైతన్య సారధి డైరెక్టర్ నాగరాజు సహకారంతో ఈ కేంద్రంలో 10 కంప్యూటర్లతో ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్న విద్యార్ధులు దీనిని వినియోగించుకునేలా సిద్దం చేశారు. విద్యార్ధులకు చిన్ననాటి నుంచే సాంకేతిక అంశాలపై అవగాహన, ఆసక్తి కలిగించేందుకే ఈ కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించామని నాట్స్ వైస్ ప్రెసిడెంట్ భాను ప్రకాశ్ ధూళిపాళ్ల (Bhanu Prakash Dhulipalla) అన్నారు.

పేదరికం కారణంగా విద్యార్ధులు (Students) సాంకేతిక విద్యకు దూరం కాకూడదనే ప్రభుత్వ పాఠశాలలో ఈ కంప్యూటర్ ల్యాబ్ (Computer Lab) ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి రోజు ఈ ల్యాబ్ నిర్వహణ, సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించేందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కూడా ఓ వ్యవస్థను ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమన్నారు.

ఈ కార్యక్రమానికి మద్దతు అందించిన డాక్టర్ పూర్ణ బిక్కసాని, డాక్టర్ శేఖరం కొత్త కు నాట్స్ (North America Telugu Society – NATS) ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఇంత చక్కటి కార్యక్రమానికి సహకరించిన నాట్స్ నాయకులు రాజేశ్ కాండ్రు, మురళీకృష్ణ మేడిచెర్ల, సుధీర్ మిక్కిలినేని, కిరణ్ మందాడి, రవి కిరణ్ తుమ్మల, సంకీర్త్‌కు భాను ప్రకాశ్ ధూళిపాళ్ల కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected