Connect with us

Politics

ఆనంద డోలికల్లో TDP, JSP, BJP శ్రేణులు @ Fremont, California విజయోత్సవ వేడుక

Published

on

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వైసీపీని చిత్తుగా ఓడించి శ్రీ నారాచంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నాలుగో సారి ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో అమెరికా లో బే ఏరియా (Fremont, California) కి చెందిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ అభిమానులు, టీడీపీ, జనసేన మరియు భాజపా కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు.

జూన్ 16 ఆదివారం సాయంకాలం కాలిఫోర్నియా రాష్ట్రం, ఫ్రీమోంట్ (Fremont, California) నగరంలోని సెంట్రల్ పార్క్ (Central Park) ఈ సంబరాలకి వేదిక అయ్యింది. ఎన్నారై తెలుగుదేశం అధ్యక్షులు కోమటి జయరాం పర్యవేక్షణలో స్థానిక ఎన్నారై టీడీపీ ప్రముఖులైన కోగంటి వెంకట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఆద్యంతం వైభవంగా జరిగింది. 900 కి పైగా ప్రవాసాంధ్రులు ఈ వేడుకల్లో పాల్గొని ఆంధ్రప్రదేశ్ బంగారు భవిష్యత్తు ని చంద్రబాబు తీర్చిదిద్దగలరన్న ఆకాంక్షని వెలిబుచ్చారు.

మహిళలు, చిన్నారులు ఈ సంబరాల్లో పెద్ద ఎత్తున పాల్గొనడం విశేషం. తొలుత ఫ్రీమోంట్ లోని  హాప్కిన్స్ స్కూల్ నుంచి 250కి పైగా కార్లతో ర్యాలీగా సమావేశ స్థలానికి చేరుకున్న తెలుగుదేశం, జనసేన మరియు భాజపా అభిమానులు 4 గంటలకు పైగా వివిధ కార్యక్రమాలు నిర్వహించి చంద్రబాబు అనుభవం మరియు దక్షత, పవన్ కళ్యాణ్ నిబద్ధత, ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వం ఆంధ్రప్రదేశ్ బంగారు భవిష్యత్తుకు అత్యంత అవసరమని నినదించారు.

ఎన్నారై తెలుగుదేశం (NRI TDP) అధ్యక్షులు కోమటి జయరాం, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Dr. Chandra Sekhar Pemmasani), భాజపా శాసనసభ్యులు సుజనా చౌదరి మరియు జనసేన శాసనసభ్యురాలు శ్రీమతి లోకం మాధవి ఈ విజయోత్సవ కార్యక్రమాన్ని ఉద్దేశించి వీడియో కాల్ ద్వారా ప్రసంగించారు.

“ఆంధ్రప్రదేశ్ లో విధ్వంసకరమైన ప్రజావ్యతిరేక పాలనను అంతమొందించడంలో టీడీపీ ఎన్‌ఆర్ఐ విభాగం కీలకపాత్ర పోషించడం హర్షణీయం. ఈ విజయం అందరిది. రాష్ట్రాభివృద్ధి, యువత భవిష్యత్తు, ప్రజా సంక్షేమమే చంద్రబాబుగారికి ముఖ్యం. రాష్ట్రాభివృద్ధి కోసం ఆయన చేస్తున్న పోరాటంలో ఎన్నారై లు మరింత పాత్రను పోషించుదాం” అని కోమటి జయరాం పిలుపునిచ్చారు.

పెమ్మసాని చంద్రశేఖర్ ఇది ఒక  చారిత్రాత్మక విజయమని అభివర్ణించారు. ఇంతటి విజయాన్ని ఇచ్చిన తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party), జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు యావత్ రాష్ట్ర ప్రజానీకానికి మరియు ఎన్నారైలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అన్నారు.

సుజనా చౌదరి మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో ఎన్ఆర్ఐలు కొన్ని నెలల పాటు ఉద్యోగాలు, కుటుంబాల్ని వదలి రాష్ట్రంలోనే ఉంటూ విజయం కోసం ఎనలేని కృషి చేశారు. వారందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) గారికి మరియు చంద్రబాబు గారికి ఎన్నారైలు మరింత చేదోడువాదోడుగా ఉంటారని శ్రీమతి లోకం మాధవి ఆశాభావం వ్యక్తం చేశారు.

వెంకట్ కోగంటి (Venkat Koganti) ప్రసంగిస్తూ.. అవినీతిపాలనని అంతమొందించడానికి నారా లోకేష్ (Nara Lokesh) గారు చేసిన యువగళం యాత్ర యువతకి స్పూర్తిదాయకంగా నిలిచిపోతుందని కొనియాడారు. ఇంతటి ఘనవిజయం కోసం అరహరం శ్రమించిన చంద్రబాబు (Nara Chandrababu Naidu) గారికి, పవన్ కళ్యాణ్ గారికి, భాజపా నాయకులకు ప్రతేక ధన్యవాదాలు తెలిపారు.

స్థానిక ఎన్నారై టీడీపీ (NRI TDP) నాయకులు భక్తా భల్లా, విలేఖ్య, జనసేన (NRI Janasena) నాయకులు రెడ్డయ్య, చంద్ర మరియు భాజపా (Bharatiya Janata Party) నాయకులు తిరుపతయ్య తదితరులు ఈ విజయం కోసం పాటుపడిన వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమాన్ని శ్రీనివాస్ తాడపనేని, గాంధీ పాపినేని, జగదీష్ గింజుపల్లి, విజయ్ గుమ్మడి, వీరు ఉప్పల, విజయ ఆసూరి, రమేష్ కొండా, బాబు ప్రత్తిపాటి సమన్వయపరచగా, హరి బొప్పూడి, నరహరి, అశోక్ మైనేని, విష్ణు బూరుగుపల్లి, రాజా కొల్లి, తిరు కాకరాల, అనిల్ అరిగే, నవీన్ కొండపల్లి, ప్రసాద్ మంగిన, సీతారాం కొడాలి తదితరులు సమర్ధవంతంగా నిర్వహించారు.

చంద్ర గుంటుపల్లి, వెంకట్ జెట్టి, అడుసుమల్లి వెంకట్, శ్రీనివాస్ వీరమాచినేని, రవికిరణ్ ఆలేటి, హరి సన్నిధి, మోహన్ మల్లంపాటి, దివ్య, సునిత రాయపునేని, శిరీష నెక్కలపూడి, శైలజ వెల్లంకి, శ్రావ్య పిన్నమనేని, సిరియాలు, ప్రభ మల్లారపు, ప్రత్యూష, రూప, రుద్రాణి, లోకేష్, ముచ్చెర్ల గోపి, మురళి గొడవర్తి, రాందాస్, అనంత్, మురళి, నవీన్ కొడాలి, కృష్ణ కోగంటి, రాం భైరపునేని, శివ, హర్ష యడ్లపాటి, కృష్ణమోహన్ మట్టపర్తి తదితర ముఖ్యులు హాజరయ్యారు.

బే ఏరియా (Bay Area, California) లోని ప్రముఖ రెస్టారెంట్లు బిర్యానీ జంక్షన్, ఆహా, బిర్యానీస్ (మిలిపీటాస్), విజేత స్వగృహ ఫుడ్స్, ఆర్. ఆర్. ఆర్. బిర్యానీస్ (ఫ్రీమోంట్), ఆర్.ఆర్.ఆర్. బిర్యానీస్ (మౌంటైన్ వ్యూ), ఘుమఘుమలు హాజరైన వారందరికీ పసందైన భోజనం సమకూర్చారు. కార్యక్రమ నిర్వాహకులు వెంకట్ కోగంటి కార్యక్రమం విజయవంతమవ్వడానికి కృషిచేసిన వాలంటీర్లకి, హాజరయ్యిన వారికి, స్పాన్సర్లందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected