Connect with us

Politics

TDP కూటమి అఖండ విజయాన్ని స్వాగతించిన అమెరికా రాజధాని ప్రవాసులు @ Washington DC

Published

on

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం కూటమి (TDP) సాధించిన అఖండ విజయాన్ని స్వాగతిస్తూ.. ప్రవాసులు, వారి తల్లి దండ్రులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని తమ ఆనందోత్సాహాలను పంచుకున్నారు.. ఎన్నారై తెలుగుదేశం (NRI TDP Washington DC) విభాగం ఆధ్వర్యంలో జూన్ 4న నిర్వహించిన ఈ కార్యక్రమంలో, కూటమి విజయం నవ్యాంధ్ర నవోదయానికి ప్రజా విజయ గీతిక అని అన్నారు.

యాష్ బొద్దులూరి మాట్లాడుతూ… చైతన్యానికి ప్రతీక ఐన తెలుగు వారు ఈ ఎన్నికల్లో తమ విజ్ఞత ప్రదర్శించారని, గత ప్రభుత్వం అభివృద్ధికి ఆనవాళ్లులేని ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ను మిగిల్చిందని.. అందుకే ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించారని.. ప్రాంతాలకతీతంగా చంద్రబాబు (Nara Chandrababu Naidu) ని కోరుకున్నారని.. రాష్ట్రాన్ని గాడిలో పెట్టె నాయకుడు ఆయనే అని.. ముఖ్య భూమిక పోషించిన జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కి ప్రత్యేక కృతఙ్ఞతలు అని తెలిపారు.

భాను మాగులూరి మాట్లాడుతూ… ఇది తెలుగు ప్రజల విజయమని.. బటన్ నొక్కుడు లాంటి కళ్ళు బొల్లి కబుర్లు చెప్పిన వారికి చెంప చెల్లుమనే సమాధానము ఇచ్చారని అన్నారు. కక్ష పూరిత పాలనను, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే అసంబద్ధ పాలను తిప్పి కొట్టారని. సమర్ధ నాయకత్వం గెలుపుకు కలిసొచ్చిన జనసేన (Jana Sena Party – JSP), బీజేపీ (Bharatiya Janata Party – BJP) పార్టీలకు కృతఙ్ఞతలు తెలిపారు.

దశాబ్దాలుగా తమ ఆస్తుల్ని, ఆప్తుల్ని పోగొట్టుకున్న ఎందరో పార్టీ అభిమానులు, కార్యకర్తలు, కుటుంబాలు.. మీ త్యాగం, అంకితభావం గుర్తుచేసుకుంటూ.. గ్రామాల్లో.. తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party – TDP) కి పట్టుకొమ్మల్లా నిలిచిన ఎందరో ప్రవాస భారతీయ తల్లిదండ్రులు, మహిళా అభిమానుల సమక్షంలో ఈ సెలెబ్రేషన్స్ నిర్వహించారు.

ఈ విజయోత్సవ కార్యక్రమంలో నీలిమ చనుమోలు, తేజస్వి, సుధీర్ కొమ్మి, యువ సిద్ధార్ధ్ బోయపాటి, చక్రవర్తి పయ్యావుల, రమేష్ అమిర్నేని, భాను ఆకర్ష్ , వీర్రాజు, సత్యనారాయణ రాజు, జ్యోతి ప్రకాష్ సీతారామారావు, రామకృష్ణ, ప్రదీప్, అజయ్, వినీల్, మురళి, మనోజ్, అంకిత తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected