Connect with us

Community Service

సేవానిరతిలో పట్టు వదలని విక్రమార్కుడు Ramakrishna Allu

Published

on

మాటలు తక్కువ, చేతలు ఎక్కువ. ఒక పని అప్పగిస్తే, ఆ పని పూర్తి చేసేవరకు పని రాక్షసుడిలా నిద్రపోడు. బ్యాక్ ఎండ్ లో లాజిస్టిక్స్ అంతు చూడడం లో దిట్ట. అతనే నార్త్ కరోలినా రాష్ట్రం, ర్యాలీ (Raleigh) వాసి రామకృష్ణ అల్లు (Ramakrishna Allu).

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అనంతపురం (Anantapur) జిల్లా, రామాపురం గ్రామానికి చెందిన రామక్రిష్ణ చౌదరి అల్లు 2009 లో అమెరికా విచ్చేశారు. ఉద్యోగ రీత్యా నార్త్ కరోలినా రాష్ట్రం, ర్యాలీ నగరం (Raleigh, North Carolina) లో సెటిల్ అయ్యారు.

ర్యాలీ లోని ట్రయాంగిల్ ఏరియా సంఘం (Triangle Area Telugu Association) అధ్యక్షునిగా, అంతకు ముందు వివిధ హోదాల్లో దశాబ్దకాలంగా కమ్యూనిటీ సర్వీస్ లో ఉన్నారు. మన సంస్కృతీ సాంప్రదాయాలను ముందు తరాల వారికి తెలియజెప్పేలా పలు కార్యక్రమాలు నిర్వహించారు.

అలాగే విద్యార్థుల కోసం పబ్లిక్ స్పీకింగ్ సెమినర్స్, కెరీర్ డే, ఇమ్మిగ్రేషన్ సెమినర్స్, వ్యాస రచన వర్క్ షాప్, లెగో లీగ్, క్రీడాకార్యక్రమాలు, కాలేజీ అడ్మిన్షన్ ప్రాసెస్, తెలుగు బడి వంటి ఎన్నో ప్రోగ్రామ్స్ నిర్వహించారు. ఇవన్నీ కొన్ని మచ్ఛు తునకలు మాత్రమే.

కోవిడ్ మహమ్మారి సమయంలో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అందించారు. కోవిడ్ వాక్సిన్ పై అవగాహన కల్పించారు. తానాలో టీం స్క్వేర్ ఛైర్ తో కలసి మరియు ఎన్నో కమిటీలలో వివిధ సాంస్కృతిక, జాగృతి కార్యక్రమాలలో సేవలందించారు. ముఖ్యంగా నార్త్ కరోలినా ప్రాంతంలో తానా టీం స్క్వేర్ (Team Square) విపత్తులకు చేదోడు వాదోడుగా నిలిచారు.

ధీం తానా (Dhim-TANA), NTR శతజయంతి వేడుకలు, తానా తరంగాలు, తానా మహాసభలు వంటి ఎన్నో కార్యక్రమాలలో విశిష్ట సేవలందించారు. రామకృష్ణ అల్లు నాయకత్వంలో అమెరికాలోనే అత్యధికమైన ధీం తానా కార్యక్రమాలు నిర్వహించిన రాష్ట్రంగా 2023 లో నార్త్ కరోలినా (North Carolina) శాఖ నిలిచింది.

ఆర్థిక ఇబ్బందులెదుర్కొంటున్న తెలుగు వారి కొరకు మరియు తానా కార్యక్రమాల నిర్వాహణ కొరకు పలు సందర్భాలలో నిధుల సమీకరణ విజయవంతంగా చేపట్టారు. ఇండియాలో పేదలకు ఉగాది, రంజాన్ వంటి పండుగల సమయంలో గిఫ్ట్స్ అందజేసి దాతృత్వాన్ని చాటుకున్నారు రామకృష్ణ అల్లు.

ప్రస్తుత తానా ఎన్నికలలో ఫౌండేషన్ ట్రస్టీ అభ్యర్థిగా ముందుకు వస్తున్న రామకృష్ణ అల్లు మరియు టీం కోడలి (Team Kodali) ప్యానెల్ లోని ప్రతి ఒక్కరికీ ఓటు వేసి గెలిపించవలసిందిగా తానా మెంబర్స్ అందరికీ గౌరవంగా మనవి చేస్తున్నారు. రామకృష్ణ అల్లు గురించి మరిన్ని వివరాలకు www.ramallu4tana.com ని సందర్శించండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected