అమెరికాలోని వాషింగ్టన్ డీసీ (Washington DC) లో సాఫ్టువేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేసుకుంటూ భార్యాపిల్లలతో నివసిస్తున్న యశస్వి బొద్దులూరి (Yash Bodduluri), అనారోగ్యంతో ఉన్న తన తల్లి ని పరామర్శించడానికి ఇండియా (India) వెళ్లారు.
ఈ రోజు హైదరాబాద్ విమానాశ్రయం (Hyderabad Airport) లో దిగీ దిగగానే, ఆంధ్రప్రదేశ్ పోలీసులు (Andhra Pradesh CID) కస్టడీ లోకి తీసుకొని రోడ్డు మార్గం ద్వారా మంగళగిరి డిజిపి ఆఫీసుకు విచారణ కోసం తరలిస్తున్నట్టు ఈ వీడియోలో ప్రస్ఫుటంగా తెలుస్తుంది.
స్వతహాగా తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) అభిమాని అయిన యశస్వి బొద్దులూరి ప్రవాసంలో ఉండి కూడా, రాష్ట్రం పట్ల బాధ్యతగల పౌరుడిగా నిత్యం రాష్ట్రంలో జరిగే పరిణామాలమీద తన అభిప్రాయాల్ని సోషల్ మీడియాలో నిర్భయంగా వెలిబుచ్చుతుంటారు.
ఈ విషయంలోనే కస్టడీ లోకి తీసుకొని ఉండవచ్చని తన స్నేహితులు అంటున్నారు. ఈ సందర్భంగా అతని మిత్రులు అప్రజాస్వామిక నిర్బంధాన్ని ఖండిస్తున్నామని, వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఉయ్ స్టాండ్ విత్ యష్ బొద్దులూరి (Yash Bodduluri)అంటూ సోషల్ మీడియాలో మద్దతుగా నిలుస్తున్నారు.