Connect with us

News

బాబుకు మద్దతుగా Washington DC లో గాంధీ విగ్రహానికి నివాళి

Published

on

అమెరికా రాజధాని వాషింగ్టన్ డీ.సీ (Washington DC) లోని భారత రాయబార కార్యాలయం వద్ద జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి పూలతో ప్రవాసాంధ్రులు ఘన నివాళి అర్పించారు. నిజం గెలవాలి అని మహాత్ముని సాక్షిగా నినదించారు. ఈ కార్యక్రమాన్ని భాను ప్రకాష్ మాగులూరి (Bhanu Prakash Maguluri) సమన్వయ పరిచారు.

ప్రవాసాంధ్రులు మాట్లాడుతూ.. ఏనాటికైనా సత్యమే గెలుస్తుంది. ప్రజలకు దూరం చూసే కుట్రలో భాగంగానే చంద్రబాబుపై అక్రమ కేసు నమోదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. న్యాయం చేయాల్సిన చోట జాప్యం జరగటం అన్యాయ మన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం రోజురోజుకూ పతనమవుతోందన్నారు.

తెలుగువారి అభ్యున్నతి కోసం ఒక శ్రమ జీవి చేసిన చెదరని, చెరిగిపోని శతాబ్దపు సంతకం.. నారా చంద్రబాబు నాయుడు.. అని నినదించారు. తమ బిడ్డల భవిష్యత్తుకు ఆనాడు ఆయన చేసిన నిరంతర కృషి, తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు, పట్టు వదలని సత్సంకల్పం ఫలితమే ఈనాడు అమెరికాలో తెలుగు జాతి శాశ్వత విజయకేతనం అన్నారు.

ఈ కార్యక్రమంలో జానకిరామ్, రమేష్ గుత్తా, నెహ్రు, భాను ఆకర్ష్ వలేటి, ఆచంట శ్రీకాంత్, రమేష్ అవిర్నేని, నరేష్, వినీల్, పెద్ది సాంబశివరావు, వీరనారాయణ, ప్రభు, దుర్గాప్రసాద్, బసవరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు చంద్రబాబు (Nara Chandrababu Naidu) కు బెయిల్ రావడం పట్ల ప్రవాసాంధ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

error: NRI2NRI.COM copyright content is protected