Connect with us

Games

TANA Arkansas Chapter ఆధ్వర్యంలో పిల్లలకు ఆటల పోటీలు

Published

on

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (Telugu Association of North America) ఆధ్వర్యంలో, తానా స్పోర్ట్స్‌ కమిటీ నిర్వహిస్తున్న వివిధ టోర్నమెంట్లలో భాగంగా ఆదివారం సెప్టెంబర్‌ 17 తేదీన తానా ఆర్కన్సాస్‌ (Arkansas) చాప్టర్ పిల్లలకు ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు.

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) అధ్యక్షులు నిరంజన్‌ శృంగవరపు ఆధ్వర్యంలో తానా స్పోర్ట్స్‌ కోఆర్డినేటర్‌ నాగ పంచుమర్తి, తానా నేషనల్‌ స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ చైర్‌ రాజ్‌ యార్లగడ్డ ఈ పోటీలకు అవసరమైన ఏర్పాట్లను టీమ్‌తో కలిసి చేస్తున్నారు.

ఆర్కన్సాస్‌, బెంటన్‌విల్ (Bentonville) లోని స్థానిక మెమోరియల్‌ పార్క్‌లో ఈ పోటీలు (Kids Games) నిర్వహిస్తున్నారు. అలాగే పెద్దవారికి, ఇండియా నుంచి వచ్చిన పేరెంట్స్ కి సరదా ఆటలు కూడా నిర్వహిస్తున్నారు. ఇతర వివరాలకు పై ఫ్లయర్‌ చూడండి.

error: NRI2NRI.COM copyright content is protected