కమ్యూనిటీ సేవా కార్యక్రమాలకు చిరునామాగా నిలిచిన తానా సంస్థతో 2011 నుంచి మంచి అనుబంధం ఉంది అంటున్నారు న్యూజెర్సి ప్రాంత తానా రీజినల్ రిప్రజెంటేటివ్ పదవికి పోటీ పడుతున్న వంశీ వాసిరెడ్డి. టీం నిరంజన్ ప్యానెల్ లో అందరికీ చేదోడు వాదోడుగా ఉంటున్న వంశీ ఏమంటున్నాడో చూద్దాం.
ప్రస్తుతం తానా 5కె రన్ నేషనల్ కో ఆర్డినేటర్‌గా ఉన్నాను. వలంటీర్‌గా, కమిటీ చైర్‌గా కూడా పని చేశాను. వివిధ కార్యక్రమాలను నిర్వహించడంతోపాటు ఇతర బాధ్యతలను నిర్వహించిన అనుభవంతో ప్రస్తుతం జరుగుతున్న తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎన్నికల్లో 2021-23 సంవత్సరానికిగాను న్యూజెర్సి ప్రాంత రీజినల్ రిప్రజెంటేటివ్ పదవికి పోటీ పడుతున్నాను. ఈ ఎన్నికల్లో నన్ను గెలిపించి న్యూజెర్సిలోనూ, ఇతర పరిసర ప్రాంతాల్లో ఉన్న తెలుగు కమ్యూనిటీకి సేవ చేసే అవకాశాన్ని కలిగించాలని కోరుకుంటున్నాను.
తానాలో వివిధ కార్యక్రమాల నిర్వహణలో పాల్గొనడంతోపాటు వాటి విజయవంతానికి కృషి చేశాను. 2013 నుంచి తానా టీమ్‌స్క్వేర్ వలంటీర్‌గా, 2017-19 సంవత్సరంలో మెంబర్షిప్ బెనెఫిట్స్ కో చైర్‌గా, 2017లో ధీమ్ తానా కో ఆర్డినేటర్‌గా, 2017లో ఫిలడెల్ఫియా తానా ప్రాంతీయ మహాసభల్లో గెస్ట్ కమిటీ చైర్‌గా, 2018లో 5కె రన్‌కు నార్త్ ఈస్ట్ కో ఆర్డినేటర్‌గా, 2018లో తానా సంక్రాంతి సంబరాలు ఈవెంట్ కో ఆర్డినేటర్‌గా, 2020లో మేడసాని మోహన్ కార్యక్రమం నిర్వహణలో, తానా వరల్డ్ తెలుగు కల్చరల్ ఫెస్టివల్లో కో ఆర్డినేషన్ టీమ్ మెంబర్‌గా పనిచేశాను.
కోవిడ్ 19 సమయంలో తెలుగు రాష్ట్రాల్లో పేదలకు తానా ఫౌండేషన్ ద్వారా సహాయం చేశాను. తానా ఫుడ్ డ్రైవ్ కార్యక్రమంలో, ఇండియాలో తానా బ్యాక్‌ప్యాక్ కార్యక్రమానికి చేయూతనివ్వడంలోనూ, తానా చైతన్యస్రవంతి కార్యక్రమంలో రైతులకు రక్షణ పరికరాలను పంపిణీ చేశాను. ఇలా ఎన్నో కార్యక్రమాల్లో పాలుపంచుకున్న నన్ను గెలిపించాల్సిందిగా కోరుకుంటూ, ఎల్లప్పుడూ మీకు సేవ చేసే అవకాశాన్ని కల్పించాల్సిందిగా మరోసారి కోరుతున్నాను.