Connect with us

Sports

అమెరికా, కెనడా నుంచి 300+ ఆటగాళ్లతో 30+ టీమ్‌లు @ Detroit Telugu Association Volleyball Tournament

Published

on

డీటీఎ ప్రెసిడెంట్ కిరణ్ దుగ్గిరాల నేతృత్వంలో ఉదయ్ చాపలమడుగు గారు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ నిర్వహించిన వాలిబాల్ టోర్నమెంట్ సందర్శకులను వీక్షకులను అబ్బురపరుస్తూ విజయవంతంగా సాగింది. దేశం నలుమూలల నుంచి వచ్చిన 30 టీమ్స్ హోరాహోరీగా ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు ఆడుతూ సందర్శకుల జయ జయ ధ్వానాల మధ్య పోరాడాయి.

అమెరికా లోని మిడ్‌ వెస్ట్‌ లో అతి పెద్ద టోర్నమెంట్‌గా భావించే ఈ టోర్నీలో అమెరికా, కెనడా నుంచి 300+ ఆటగాళ్లతో 30+ టీమ్‌లు పాల్గొన్నాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోటీల్లో చివరిగా ఫైనల్స్ లో న్యూజెర్సీ కీ చెందిన NB Kings , గత సంవత్సరపు చాంపియన్ ఫార్మింగ్టన్ ఫైటర్స్ తో తలపడి 19-21, 21-19, 13-15 పాయింట్‌లతో గెలిచి వీక్షకులను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తింది.

డిటిఎ ప్రెసిడెంట్‌ కిరణ్‌ దుగ్గిరాల, వారి టీమ్‌ ఈ టోర్నమెంట్‌ విజయానికి ఎంతో కృషి చేసింది. ఈ క్రీడాపోటీల సంచాలకులు శివ జుజ్జవరపు, సుధీర్‌ బచ్చు, తనుజ్ రెడ్డి వంచా మూడు నెలల పాటు అందరినీ సమన్వయ పరుస్తూ ఈ టోర్నమెంట్‌కు అవసరమైన ఏర్పాట్లను చేశారు.

ఈ టోర్నమెంట్‌ను చూసేందుకు దాదాపు 300 మందికి పైగా రావడం డెట్రాయిట్ తెలుగు సంఘం నాయకులను ఆశ్చర్య పరిచి, క్రీడాకారులను ఉత్సాహ పరిచింది. పోటీల్లో పాల్గొన్న ఆటగాళ్ళంతా తమ టీమ్‌ విజయం కోసంహోరాహోరీగా పోరాడారు.

ఈ కార్యక్రమానికి తానా పూర్వ బోర్డ్‌ అధ్యక్షుడు హనుమయ్య బండ్ల, తానా జాయింట్‌ ట్రెజరర్‌ సునీల్‌ పంట్ర, ఎస్‌వి బోర్డ్‌ ట్రస్టీ జోగేశ్వరరావ్‌ పెద్దిబోయిన, రాజా చెన్నుపాటి, ఉదయ్‌ చేపలమడుగు, శివరామ్ యార్లగడ్డ, డిటిఎ పాస్ట్‌ ప్రెసిడెంట్‌ నీలిమ మన్నె, ద్వారకా ప్రసాద్ బొప్పన తదితరులు హాజరయ్యారు.

వీరు ఈ టోర్నమెంట్‌ విజేతకు బహుమతులను ప్రదానం చేసి, ఈ టోర్నమెంట్‌లో పాల్గొన్న ఆటగాళ్ళను, విజయవంతంగా నిర్వహించిన డిట్రాయిట్‌ తెలుగు సంఘం (Detroit Telugu Association) నాయకులను, వలంటీర్లను అభినందించారు.

చివరిగా డెట్రాయిట్ తెలుగు సంఘం (DTA) అధ్యక్షులు కిరణ్ దుగ్గిరాల (Kiran Duggirala) మాట్లాడుతూ.. ఇటువంటి గొప్ప మెగా టోర్నమెంట్ ను నిర్వహించి విజయవంతం చేసిన కార్యకర్తలను, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులను, క్రీడాకారులను అభినందించారు.

అలాగే డెట్రాయిట్ తెలుగు సంఘం పూర్వ నాయకత్వం ఇచ్చిన సహాయ సహకారాలను మననం చేసుకుంటూ వినమ్రంగా కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో ఇటువంటి మరిన్ని కార్యక్రమాలను చేస్తూ డెట్రాయిట్ తెలుగు సంఘం కు పూర్వ వైభవం తీసుకువస్తానని ప్రతిజ్ఞ చేశారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected