తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను అమెరికా అంతటా TTA ఫౌండర్ డా. పైళ్ల మల్లారెడ్డి అశీసులతో ఘనంగా నిర్వహిస్తున్న ఏకైక సంస్థ తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (Telangana American Telegu Association).
ఇందులో భాగంగా అడ్వైజరీ చైర్ డా విజయపాల్ రెడ్డి, అడ్వైజరీ కోచైర్ మోహన్ రెడ్డి పట్లోళ్ల, మెంబర్ భరత్ రెడ్డి మాదాడి లు మొట్ట మొదటి సారిగా తెలంగాణ కి ప్రీతీ పాత్రమైన బోనాలు మరియు అలయ్ బలయ్ జాతరను జరపాలని నిర్ణయించారు.
ప్రెసిడెంట్ వంశీ రెడ్డి (Vamshi Reddy Kancharakuntla) అధ్యక్షతన జరిగిన టిటిఎ అలయ్ బలయ్ కు వివిధ నగరాలలో జనం పెద్ద ఎత్తున పోటెత్తారు. టిటిఎ ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది స్వంత నగరమైన షార్లెట్ లో అలయ్ బలయ్ జాతర సంబురాలు అంబరాన్ని అంటాయి.
మీడియా కమ్యూనికేషన్ డైరెక్టర్ నిశాంత్ సిరికొండ మరియు బోర్డు అఫ్ డైరెక్టర్ శ్రీకాంత్ గాలి నేతృత్వంలో టిటిఎ షార్లెట్ టీం (Charlotte TTA Team) మార్విన్ ఎఫైర్డ్ పార్క్ నందు శనివారం జులై 22న నిర్వహించిన సంబురాలు నాలుగు వందల మంది ఆహుతులతో కిక్కిరిసింది.
విచ్చేసిన వారందరు సాంస్కృతిక కార్యక్రమాలు (Cultural Programs) మరియు అట పాటలతో అలయ్ బలయ్ (Alai Balai) చేసుకున్నారు. వచ్చిన వారికి టిటిఎ షార్లెట్ వాలంటీర్లంతా చక్కని విందు భోజనం ఏర్పాటు చేశారు.
టిటిఎ షార్లెట్ టీం అంకుష్, అరుణ్, ఆహ్లద రెడ్డి, దిలీప్, రాఘవేంద్ర, ప్రవీణ్ రెడ్డి, భరత్, అభి, శరన్, నరేన్, దీప్తి భరద్వాజ్, రమేష్, యశ్వంత్, సతీష్ సిరికొండ తదితరులు వచ్చిన వారి అందరికి ధన్యవాదాలు తెలియచేసి విజయవంతంగా ముగించారు.