ప్రతిసారీ తానా మహాసభలకు ముందు ధీం-తానా (DhimTANA) పోటీలు పలు నగరాల్లో నిర్వహించి, ఆ విజేతలందరికీ మహాసభల్లో ఫైనల్ పోటీలు నిర్వహించడం ఆనవాయితీ. కాకపోతే కోవిడ్ అనంతరం 4 సంవత్సరాల తర్వాత నిర్వహిస్తున్న ధీం-తానా పోటీలు కాబట్టి కొంచెం వ్యయప్రయాసలతో కూడుకున్న విషయమే.
సుమారు 6 నెలల క్రితం బీజం వేసిన ఈ ధీం-తానా కమిటీ కోసం ఛైర్ గా మాలతి నాగభైరవ, కోఛైర్స్ గా శ్రీలక్ష్మి కులకర్ణి మరియు సోహిని అయినాల, అలాగే కమిటీ సభ్యులుగా పూలని జాస్తి, పల్లవి దొప్పలపూడి, ఆర్తిక అన్నే మరియు ప్రియాంక గడ్డం లతో సెన్సేషనల్ సెవెన్ (Sensational Seven) టీం ని ఏర్పాటుచేశారు.
అదే తడవుగా అందరి అంచనాలను అధిగమించి తానా చరిత్రలో మొట్టమొదటిసారి ధీం-తానా కమిటీనే కావాల్సిన ఫండ్స్ అన్నీ రైజ్ చేశారు. ధీం-తానా కోసం ప్రత్యేకంగా వెబ్సైట్ రూపొందించి రెజిస్ట్రేషన్స్ అన్నీ కేంద్రీకృతంగా వన్ స్టాప్ ఫర్ ఆల్ అయ్యేలా రిపోర్టింగ్ ఫెసిలిటీస్ తో డిజైన్ చేశారు.
ఇంతకు మునుపెన్నడూ లేని విధంగా ఈసారి ధీం-తానా నిర్వహణ కోసం అలాగే ట్రోఫీస్, క్రౌన్స్, సాషాస్, మీడియా కోసం ప్రతి నగరానికి $3000 ఫండ్స్ అందించారు. ఫండ్స్, వెబ్సైట్, ఎగ్జిక్యూషన్ ఇలా అన్ని విషయాలలో Sensational Seven ధీం-తానా కమిటీని మాత్రం తప్పక అభినందించాలి.
మంచి ప్రణాళికలతో ప్రతిభకు పట్టం కట్టే ధీం-తానా (DhimTANA) మొదటి పోటీలు 112 రెజిస్ట్రేషన్స్ తో ఏప్రిల్ 30న అట్లాంటాలో నిర్వహించి మంచి శుభారంభాన్ని అందించారు. ఆ తరువాత వరుసగా ప్రతి వారాంతం అమెరికాలోని 18 నగరాల్లో నిర్వహించి ధీం-తానా విజయ పరంపరను కొనసాగించారు.
తానా మహాసభలు (TANA Convention) దగ్గిరపడే సమయంలో ఫిలడెల్ఫియా నగర స్థాయి ధీం-తానా పోటీలు మంచి ఊపు తెచ్చా తెచ్చాయి. ప్రతి నగరంలో పలు విభాగాల విజేతలకు మెమెంటోస్, క్రౌన్ అందించారు. అలాగే తానా కళాశాల గురువులను సన్మానించడం అభినందనీయం. ఈసారి కొత్తగా నిర్వహించిన చిలక గోరింక కపుల్ కాంటెస్ట్ కి అసాధారణ స్పందన రావడం విశేషం.
ఇంతలోనే ఫిలడెల్ఫియా మహానగరంలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో 2023 జులై 7, 8, 9 తేదీలలో అంజయ్య చౌదరి లావు (Anjaiah Chowdary Lavu) అధ్యక్షతన, రవి పొట్లూరి (Ravi Potluri) కన్వీనర్ గా, శ్రీనివాస్ లావు (Srinivas Lavu) ఛైర్మన్ గా నిర్వహిస్తున్న తానా 23వ మహాసభలకు, అలాగే ధీం-తానా ఫైనల్స్ కు సమయం ఆసన్నమయింది.
దీంతో రెండు రోజులు ముందుగానే ఫిలడెల్ఫియా చేరుకున్న ధీం-తానా సెన్సేషనల్ సెవెన్ (Sensational Seven) టీం దగ్గిరుండి ఫైనల్స్ కు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. స్పాన్సర్స్, జడ్జెస్, పార్టిసిపెంట్స్ ఇలా అందరినీ సమన్వయం చేసుకుంటూ జులై 8, 9 లలో పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లోని వివిధ బాల్ రూమ్స్ లో ధీం-తానా ఫైనల్స్ పోటీలు నిర్వహించారు.
డాన్స్, సింగింగ్, బ్యూటీ పాజెంట్, చిలక గోరింక విభాగాలలో వివిధ వయోవర్గాలలో ధీం-తానా (DhimTANA) ఫైనల్స్ పోటీలలో గెలుపొందిన విజేతలకు, రన్నరప్స్ కు తానా (TANA) నాయకులు, టాలీవుడ్ (Tollywood) సెలెబ్రిటీస్, జడ్జెస్ నడుమ కోలాహలంగా మెమెంటోస్, క్రౌన్ అందజేశారు.
ఈ ధీం-తానా (DhimTANA) ఫైనల్స్ కార్యక్రమంలో పెన్సిల్వేనియా రాష్ట్ర సెనేటర్ గ్రెగ్ రాత్మన్, మాజీ యూఎస్ అంబాసడర్ కార్ల సాండ్స్, ఆస్కార్ అవార్డు విజేత & తెలుగు గేయ రచయిత చంద్రబోస్, నవ్వుల నవాబు గద్దె రాజేంద్ర ప్రసాద్, నటీమణులు రజిత, సురేఖ వాణి తదితరులు పాల్గొన్నారు.
వీరి కష్టాన్ని గుర్తిస్తూ తానా మహాసభల చివరి రోజు ధీం-తానా కమిటీ సభ్యులందరినీ మెయిన్ వేదికపై సన్మానించారు. ఈ సెన్సేషనల్ సెవెన్ (Sensational Seven) మహిళామణులు తమ దైనందిన జీవితాలలో బిజీగా ఉన్నప్పటికీ తానా 23వ మహాసభల ధీం-తానా (DhimTANA) పోటీలను ధూంధాంగా పూర్తిచేసినందుకు అందరూ అభినందించారు.
ఈ సందర్భంగా ధీం-తానా (DhimTANA) కమిటీ వారు స్పాన్సర్లకు, స్థానిక మరియు జాతీయ తానా (TANA) నాయకులకు, Awe Raw ఫోటోగ్రఫీ రత్న కి, మీడియా వారికి, జడ్జెస్ కి, పార్టిసిపెంట్స్ కి ఇలా ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు.