Connect with us

Kids

23rd TANA Conference: ‘కథాకేళి’ పోటీల విజేతలకు భాషపై మక్కువ పెంపు

Published

on

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) తెలుగు భాషా సాహిత్యం, పరివ్యాప్తి పై చేస్తున్న కృషి మీ అందరికీ విదితమే. తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, కాన్ ఫరెన్స్ కో-ఆర్డినేటర్ రవి పొట్లూరి అధ్యక్షతన మరియు వారి బృందం అధ్వర్యంలో జూలై 7-9 వ తేదీలలో ఫిలడెల్ఫియాలో జరగనున్న23వ తానా మహాసభలను అనుసరించి, ప్రవాస దేశాల్లో నివసిస్తున్న పిల్లలు మరియు యువకులకు తెలుగు భాష పై మక్కువ, పటిష్ఠత మరియు అభిరుచి పెంచడం కోసం ‘తానా – తెలుగు పరివ్యాప్తి కమిటీ’ఆధ్వర్యంలో జూన్ 24, 25 తేదీలలో జూమ్ లో ‘తానా కథాకేళి’ నిర్వహించడం జరిగింది.

తానా – తెలుగు పరివ్యాప్తి కమిటీ చైర్మన్ చినసత్యం వీర్నపు పొటీలు ప్రారంబించి, అన్నివిధాలా సహయ సహకారాలు అందించిన శ్రీ చొక్కాపు వెంకటరమణ, డాలస్ ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ పోటీలు నిర్వహించడానికి దాతలుగా ఉన్న డా. ప్రసాద్ తోటకూర, చినసత్యం వీర్నపు, మురళి వెన్నం, రవి పొట్లూరి, వెంకట రాజా కసుకుర్తి, లోకేష్ నాయుడు కొణిదల, శ్రీకాంత్ పోలవరపు, రవి పొట్లూరి, అశోక్ కొల్లా, సతీష్ కొమ్మన మరియు న్యాయ నిర్ణేతలుగా ఉన్నశ్రీ చొక్కాపు వెంకటరమణ (హైదరాబాద్, తెలంగాణ), శ్రీమతి రాజేశ్వరి నల్లాని (అనంతపూర్, ఆంధ్రప్రదేశ్), డా. వి. ఆర్. శర్మ(హైదరాబాద్, తెలంగాణ), డా. శ్రీదేవి శ్రీకాంత్ (బోత్సవానా, సౌత్ ఆఫ్రికా ) లకు ధన్యవాదలు తెలియజేశారు.

తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు మాట్లాడుతూ ‘ కథాకేళి పోటీలు ‘ వినూత్నంగా నిర్వహించాడానికి బీజం వెయ్యడానికి శ్రీకారం చుట్టి, పోటీల రూపకల్పన చేసిన చినసత్యం వీర్నపు, సతీష్ కొమ్మన , పుస్తక రచన చేసిన కేంద్ర సాహిత్య అవార్డ్ గ్రహీత శ్రీ చొక్కాపు వెంకటరమణ గారిని, అభినందించారు. ‘తానా – కథాకేళి పోటీలు ‘ మూడు విభాగాలలో(బాల్యం, కౌమార, యౌవ్వన) పోటీలు నిర్వహించగ, ప్రవాసంలో వున్న వందలాది తెలుగు పిల్లలు ఉత్సాహంతో పాల్గొన్నారు.

తానా తెలుగు పరివ్యాప్తి బృందం పిల్లలకు మాతృ భాషపై మక్కువ పెంపొందించుటకై, సులభమైన రీతిలో 100 నీతి కథల నమూనా పుస్తకాన్ని పిల్లల వయసునుబట్టి చక్కగా ఆడుతూ పాడుతూ నెర్చుకునేలా రూపిందించడం జరిగింది. తానా మొట్టమొదటి సారిగా సరికొత్త పద్దతిలో మన పూర్వీకులు అందించిన కథలు చెప్పే సంస్కృతిని, మన ముందు తరాలకు అందించాలనే సదుద్దేశంతో ‘కథాకేళి – కథలు చెప్పే పోటీలు’ కోసం 100 నీతి కథలను పొందుపరచి పిల్లలకు ఒక గైడ్ లా చేసి పిల్లకు ఇవ్వడం జరిగింది.

తానా కథాకేళి’ పోటీలలో విజేతల వివరాలు

బాల్యం (5-12 సంవత్సరాలు) విభాగం
మొదటి బహుమతి – చి. కుందన నైషదం, 10 సం., హెరండన్, వర్జీనియా.
రెండవ బహుమతి – సహస్ర దొడ్డపనేని, 12 సం, కొలంబో, ఒహాయో.
మూడవ బహుమతి – ఆషీత ముప్పలనేని, 12 సం, పార్కర్, కొలరాడో.
కన్సోలేషన్ బహుమతులను శ్రీనిధి యలవర్తి, ఉదయ్ వొమరవెల్లి, క్రిష్ణ తనవ్ వెల్లంకి, ఆషా బురాడ, కార్తీక్ పర్వతనేని.

కౌమార (13-19 సంవత్సరాలు) విభాగం
మొదటి బహుమతి – తన్మయి సాయి వెల్లంకి, 13 సం, హెరండన్, వర్జీనియా.
రెండవ బహుమతి – సహస్ర దొడ్డపనేని, 12 సం, కొలంబో, ఒహాయో.
మూడవ బహుమతి – ఇషిత తేలుగుంట్ల, 16 సం, కారీ, నార్త్ కరోలీనా.

యౌవ్వన (20 సంవత్సరాలు + ) విభాగం
మొదటి బహుమతి – శ్రీదివ్య యలమంచి, కాలిఫోర్నియా
రెండవ బహుమతి – కిరణ్మయి వారణాసి, వర్జీనియా
మూడవ బహుమతి – రాధిక కనమర్లపూడి, కాలిఫోర్నియా

తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, తానా ఫౌండేషన్ కోశాధికారి శ్రీకాంత్ పోలవరపు, కౌన్సిల్ ఏట్ లార్జ్ లోకేష్ నాయుడు కొణిదల, డాలస్ ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన, ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు, తానా పూర్వాధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మురళి వెన్నం, తెలుగు పరివ్యాప్తి కమిటి చైర్మన్ చినసత్యం వీర్నపు, కమ్యూనిటి సర్వీసెస్ చైర్మన్ వెంకట రాజా కసుకుర్తి, రవి పొట్లూరి గెలిచినవారికి ట్రోఫీలను, జూలై 7-9 వ తేదీలలో ఫిలడెల్ఫియాలో జరగనున్న23వ తానా మహా సభలలో అందజేస్తారని తెలియజేశారు.

డాలస్ ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన ఈ పోటీలలో పిల్లలకు ఇంటిదగ్గర సరైన తర్ఫీదు ఇచ్చి, పాల్గొనడానికి సహకరించిన తల్లిదండ్రులకు, సహాయసహకారాలు అందించిన కార్యకర్తలు, తానా కార్యవర్గ బృందానికి ప్రత్యేక ధన్యవాదలు తెలియజేశారు. తానా ‘కథాకేళి’ పోటీల పుస్తకాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected