Connect with us

Conference

తానా సభలకు నందమూరి యువరత్న రాక, టీజర్‌ విడుదల

Published

on

కొన్ని రోజుల క్రితం “తానా 23వ మహాసభలకు నందమూరి బాలక్రిష్ణ హాజరవనున్నారా?” అంటూ NRI2NRI.COM వార్త ప్రచురించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ వార్తని నిజం చేస్తూ ఇప్పుడు తానా మహాసభల లీడర్షిప్ అవును నందమూరి అందగాడు (Nandamuri Balakrishna) వస్తున్నారంటూ ప్రకటించారు.

ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో జులై 7 నుంచి 9వ తేదీ వరకు జరగనున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) 23వ మహాసభలకు (23rd Conference) ముఖ్య అతిధిగా నటులు, నిర్మాత, శాసనసభ సభ్యులు, బసవతారకం కాన్సర్ హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ హాజరవుతున్నారు.

యువరత్న నందమూరి బాలకృష్ణ అమెరికాలోని అశేష ప్రేక్షకాభిమానులను మరోసారి పలకరించేందుకు స్వయంగా అమెరికా వస్తున్నారు. తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు మర్యాదపూర్వకంగా నందమూరి బాలకృష్ణను హైదరాబాద్ (Hyderabad) లో కలిసి మహాసభలకు రావాల్సిందిగా ఆహ్వానించారు.

తానా చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించిన బాలయ్య, డిసెంబర్‌ 2022 లో బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రికి కోటి రూపాయల విరాళాన్ని తానా ద్వారా అందించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ మహాసభలకు బాలయ్య రాక ప్రవాస తెలుగువారందరికీ మంచి అనుభూతి కలిగిస్తుంది అని 23వ తానా మహాసభల కన్వీనర్ రవి పొట్లూరి (Ravi Potluri) తెలియజేశారు.

ఎన్టీఆర్‌ శతవసంతోత్సవ సమయంలో జరుగుతున్న ఈ మహాసభలకు బాలకృష్ణ రావడం నాటి ఎన్టీఆర్‌ అభిమానులను మరింతగా సంతోషపెడుతోందని అంటూ, తమ మాటను మన్నించి ఈ వేడుకలు వచ్చేందుకు సమ్మతించిన బాలకృష్ణకు, శ్రీమతి వసుంధర (Nandamuri Vasundhara Devi) గారికి తానా బోర్డ్‌ సభ్యులు జాని నిమ్మలపూడి (Janardhan Nimmalapudi) ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా తానా (Telugu Association of North America) మహాసభల, నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) టీజర్‌ను భారత పార్లమెంట్‌ సభ్యులు రామ్మోహన్‌ నాయుడు కింజరాపు (Ram Mohan Naidu Kinjarapu) చేతుల మీదుగా ఇటీవల విడుదల చేశారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected