Connect with us

Celebrations

కాలిఫోర్నియా మిల్పిటాస్ లో NTR@100 వేడుకలు విజయవంతం

Published

on

కాలిఫోర్నియా రాష్ట్రం, మిల్పిటాస్ నగరంలోని ఇండియా కమ్యూనిటీ సెంటర్ లో శుక్ర వారం 19 మే 2023 న అత్యంత ఘనంగా ఎన్ టీ ఆర్ శత జయంతి వేడుకలు జరిగాయి. ముఖ్య అతిధి Dr నాగేంద్ర ప్రసాద్, కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా, అతిథులు జస్టిస్ వేణు గోపాల్, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జి, జయరామ్ కోమటి, వెంకట్ కోగంటి తదితరులు జ్యోతి ప్రజ్వలన చేశారు.

మిల్పిటాస్ నగర డిప్యూటీ మేయర్ ఎవెలిన్ చు మాట్లాడుతూ.. Milpitas నగరం మే 28 వ తేదీని ఎన్ టీ ఆర్ తేదీ గా గుర్తిస్తూ proclamation చేశామని, ఎన్.టి.ఆర్ గొప్ప తనాన్ని కొనియాడారు. సర్టిఫికెట్ ని జయరామ్ కోమటి, వెంకట్ కోగంటి కి అందించారు. డా. నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ఆత్మ గౌరవం, ఆత్మాభిమానం అనే మాటలను అందరికీ తెలిసేలా చేసిన వ్యక్తి ఎన్ టి ఆర్ అని, ఆయన వ్యక్తిగా అందరికీ చిరస్మరణీయుడు అని, అలాగే ఒక ముఖ్య మంత్రి గా ఆయన అందరికీ గుర్తుండి పోయే పనులు చేశారని అన్నారు.

జస్టిస్ వేణు గోపాల్, ప్రత్యేక అతిధి మాట్లాడుతూ.. ఎన్ టి ఆర్ రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ గుర్తుంచు కొనే వ్యక్తి అని, ఆయన ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ఈ రోజు వరకు వున్నాయని తెలిపారు. వెంకట్ కోగంటి మాట్లాడుతూ.. అట్టడుగు వర్గాల వారికి దేశంలోనే మొట్టమొదటి సారి పక్కా ఇళ్ళ నిర్మాణంతో పాటు వారికి అభివృద్ధి ఫలాలు అందజేసిన అట్టడుగు వర్గాల అపధ్బాంధవుడు యన్టీఆర్ అని తెలిపారు.

జయరాం కోమటి మాట్లాడుతూ ఎన్ టి ఆర్ శత జయంతి వేడుకలు గత సంవత్సరం మే 28 నుంచి అమెరికా లో 12 నగరాల లో పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. ఈ మే నెలలో 20, 21, 27, 28 తేదీలలో ప్రపంచ వ్యాప్తంగా 100 నగరాలలో పుట్టిన రోజు వేడుకలు జరుగుతున్నాయి. బహుశా ప్రపంచ చరిత్ర లో ఇది మొదటి సారి అని చెప్పుకోవచ్చు అని అన్నారు.

కింజారపు రామూర్తి నాయుడు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, Dallas నుంచి జూమ్ లో వేదిక నుంచి మాట్లాడారు. తెలుగు రాష్ట్రాలలో ఎన్ టి ఆర్ ఫోటో లను దేముడి ఫోటోలు గా పెట్టుకొన్నారు. అలాంటి ప్రజలకు ఏ ప్రాబ్లెమ్ వచ్చినా సినిమా ఇండస్ట్రీ నుంచి ముందుకు వచ్చి సహాయం చేసే ప్రక్రియ తీసుకొచ్చిన వ్యక్తి ఎన్ టీ ఆర్.

తెలుగు దేశం పార్టీ ని స్థాపించి కింద తరగతి నుంచి కూడా అనేక నాయకులను తయారు చేసిన వ్యక్తి. పేద వాడికి కావలసిన అనేక సంక్షేమ పథకాలు మొదలు పెట్టిన వ్యక్తి. మహిళలు కూడా సమాజం లో ఒక భాగం అని చెప్పిన వ్యక్తి అని తెలిపారు. ఎన్ టి ఆర్ గొప్పతనం గురించి ముందు తరం వాళ్ల కు తెలిసేలా ఇప్పటి తరం వారు పని చేయాలని అన్నారు.

సమావేశానికి ముందుగా ప్రసాద్ మంగిన ఆధ్వర్యంలో జరిగిన సంగీత విభావరి లో గాయని గాయకులు ఎన్ టి ఆర్ సినిమాలలోని పాటలు పాడి అందరినీ అలరించారు. పాఠశాల విద్యార్థి కార్తిక్ దాన వీర శూర కర్ణ లోని దుర్యోధన పాత్ర లో నటించి అందరి చేత చప్పట్లు కొట్టించుకొన్నాడు. శ్రీ వేణు ఆసూరీ ఎన్ టి ఆర్ చిత్రాలలో వున్న వైవిధ్యం గురించి వివరించారు.

వెంకట్ కోగంటి, కళ్యాణ్ వీరపనేని, గోకుల్ రసి రాజు, వెంకట్ అడుసుమిల్లి, భక్తా భల్ల తదితరులు మాట్లాడిన ఈ కార్యక్రమాన్ని శ్రీమతి విజయ ఆసూరి నిర్వహించారు. వచ్చిన అతిథులు, మహిళలు, పిల్లల సమక్షంలో పుట్టిన రోజు కేక్ కట్ చేసి సమావేశం ఆహ్లాద కారం గా ముగించారు.

రెస్టారెంట్స్ స్వాగత్, మిస్టర్ బిర్యానీ, భీమవరం రుచులు స్పాన్సర్స్ గా శ్రీకాంత్ దొడ్డపనేని ఆధ్వర్యంలో పసందైన విందు భోజనం ఏర్పాటు చేశారు. వెంకట్ కోగంటి, వెంకట్ అడుసుమిల్లి, సయ్యద్ అహ్మద్, నరేన్ కొడాలి ప్యానల్ మరియు అనేకమంది స్పాన్సర్స్ గా ఈ కార్యక్రమానికి సపోర్ట్ గా నిలిచారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected