ఉత్తర అమెరికా తెలుగు సమితి (North American Telugu Association – NATA) ‘నాటా’ మహాసభలు వచ్చే జూన్ 30 నుండి జులై 2 వరకు టెక్సస్ రాష్ట్రంలోని డల్లాస్ కన్వెన్షన్ సెంటర్లో 3 రోజుల పాటు పెద్దఎత్తున నిర్వహించనున్న సంగతి అందరికీ తెలిసిందే.
డా. శ్రీధర్ రెడ్డి కొర్సపాటి (Dr. Sridhar Reddy Korsapati) అధ్యక్షతన, ఎన్ఎంఎస్ రెడ్డి కన్వీనర్ గా జరగబోయే ఈ 2023 నాటా మహాసభలకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా అమెరికాలోని ముఖ్య నగరాల్లో నాటా డే పేరు మీద ఫండ్రైజింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
నాటా అట్లాంటా డే ఏప్రిల్ 22 శనివారం రోజున నార్క్రాస్ లోని ఏషియానా బాంక్వెట్ హాల్లో నిర్వహిస్తున్నారు. నాటా జాతీయ నాయకులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి రానున్నారు. సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు యూత్ ప్రోగ్రామ్స్ అందరినీ అలరించనున్నాయి.
యూత్ ప్రోగ్రామ్స్ లో భాగంగా టాలెంట్ పోటీలు, క్విజ్, ఒక నిమిషం తెలుగులో మాట్లాడడం, రెండు నిమిషాల స్టేజ్ పెరఫార్మన్సెస్ వంటి స్పెషల్స్ ఎన్నో ఉన్నాయి. యూత్ ప్రోగ్రామ్స్ కొరకు సమన్వయకర్తలు గురు పరదరామి మరియు దీప్తి రెడ్డి లను సంప్రదించండి.
సాయంత్రం 6:30 నుండి మెయిన్ ప్రోగ్రాంలో భాగంగా కల్చరల్ ప్రోగ్రామ్స్, డోనార్ రికగ్నిషన్, కన్వెన్షన్ అప్డేట్స్, డిన్నర్ మొదలగు కార్యక్రమాలకు ప్రణాళిక రచించారు. రిజిస్ట్రేషన్ ఉచితం, కానీ హాల్ సామర్ధ్యం దృష్ట్యా తప్పకుండా అందరూ రిజిస్టర్ చేసుకొని నాటా అట్లాంటా డే ని విజవంతం చేయవలసిందిగా నాటా అట్లాంటా టీం కోరుతున్నారు.
మన టీవీ యాంకర్ లావణ్య గూడూరు ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. మరిన్ని వివరాలకు పై ఫ్లయర్స్ చూడండి. అలాగే రెజిస్ట్రేషన్స్ కొరకు www.NRI2NRI.com/NATA-Atlanta-Day-2023 ని సందర్శించండి.