Connect with us

Health

మేముసైతం అంటూ ఆంధ్ర కళా వేదిక ఆధ్వర్యంలో ఖతార్ కార్మికుల కోసం వైద్య శిబిరం

Published

on

ఖతార్ దేశంలో చాలా మంది తెలుగు సోదరులు పని లేకుండా ఇబ్బందులు పడుతున్న తరుణంలో దానికి తొడుగా వారిలో అనారోగ్యం కూడా చాలా మందిని భాదిస్తూ ఉండటం, అక్కడున్న పరిస్థితుల్లో హెల్త్ కార్డ్ లేక చాలా మంది హాస్పిటల్ కి కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో వున్నారని తెలుసుకొని ఆంధ్ర కళా వేదిక – ఖతార్ కార్యనిర్వాహక బృందం వారు వెల్లకిన్స్ మెడికల్ సెంటర్ వారితో కలిసి సంయుక్తంగా ఉచిత వైద్య శిబిర సదుపాయం ఏర్పాటు చేశారు.

ఫిబ్రవరి 10 శుక్రవారం రోజున ఉదయం 7 గం నుండి 12 గం వరకు ప్రత్యేకించి మన తెలుగు వర్కర్స్ కోసం ఈ ఫ్రీ మెడికల్ క్యాంపు నిర్వహించటం జరిగింది. పెద్ద సంఖ్యలో 200 మందికి పైగా తెలుగు కార్మికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు ఆంధ్ర కళా వేదికకు తమ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఖతార్ లోని భారత రాయబార కార్యాలయం నుండి భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్ గారు హాజరై కార్మికుల్ని ఉద్దేశించి మాట్లాడారు. ప్రత్యేకించి ఆంధ్ర కళా వేదిక కార్యవర్గ బృందాన్ని, వెల్కిన్స్ మెడికల్ సెంటర్ యాజమాన్యాన్ని, ఇండియన్ మెడికల్ క్లబ్ (IDC) డాక్టర్స్ ని, యునైటెడ్ నర్సస్ ఆఫ్ ఇండియా – ఖతార్ (UNIQ) నర్సస్ ని, వెయిల్కార్నెల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ని అభినందించారు.

ఉచిత వైద్య శిబిరానికి ఇండియన్ కల్చరల్ సెంటర్ (ICC) జనరల్ సెక్రటరీ – శ్రీ కృష్ణ కుమార్, అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ – శ్రీ కె.ఎస్. ప్రసాద్, ఆంధ్ర కళా వేదిక అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ శ్రీ సత్యనారాయణ మలిరెడ్డి, ప్రముఖ తెలుగు నాయకులు నందిని అబ్బగొని, శ్రీధర్, హరీష్ రెడ్డి, Ch రవి కిషోర్, సయెద్ రఫీ, చూడామణి కూడా హాజరయ్యి ఇటువంటి ఉదాత్తమైన సామాజిక సహాయ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఆంధ్ర కళా వేదిక కార్యవర్గాన్ని అభినందించారు.

ఆంధ్ర కళా వేదిక అధ్యక్షులు వెంకప్ప భాగవతుల మాట్లాడుతూ ఈ కార్యక్రమం నిర్వహించుకోవటానికి ముఖ్య కారకులైన టువంటి AKV ఉపాధ్యక్షులు గొట్టిపాటి రమణ కృషిని ఎంతగానో అభినందించారు. ఈ కార్యక్రమ భారీ విజయంలో భాగమైనందుకు వెల్కిన్స్ మెడికల్ సెంటర్ యాజమాన్యానికి, ఇండియన్ మెడికల్ క్లబ్ (IDC) డాక్టర్స్ కి, యునైటెడ్ నర్సస్ అఫ్ ఇండియా-ఖతార్ (UNIQ) నర్సస్ కి, వెయిల్కార్నెల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కి మరియు మద్దతుదారులందరికీ ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

ముఖ్యంగా నవయుగ రెసిడెంట్ డైరెక్టర్ సిహెచ్. రవికిషోర్ కి ఈ కార్యక్రమాన్ని సుసాధ్యం చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. అంతేకాక ఈ కార్యక్రమానికి సహకరించిన వాలంటీర్లకు ప్రశంసా పత్రాలు అందజేసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

అలాగే అందరికీ అల్పాహారం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమాన్ని ఆంధ్ర కళా వేదిక కార్యవర్గ సభ్యులు గొట్టిపాటి రమణ, విక్రమ్ సుఖవాసి, కేటి రావు, విబికె మూర్తి, శ్రీసుధ, సాయి రమేష్, SS రావు మరియు సోమరాజు కలిసి చాలా చక్కగా నిర్వహించినందుకు అభినందనలు తెలియజేశారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected