Hyderabad, Telangana: భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. తెలుగునాట అనేక సేవా కార్యక్రమాలు చేస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో స్పర్శ్ స్పెషల్ స్కూల్ ఫర్ ఆటిజం (Autism) చిల్డ్రన్‌కు నాట్స్ (NATS) మద్దతు ఇస్తుంది.
తాజాగా నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి (Srihari Mandadi), నాట్స్ మీడియా కో ఆర్డినేటర్ కిషోర్ నారెలు (Kishore Nare) ఈ ఆటిజం పాఠశాలను సందర్శించారు. ఆటిజం పిల్లలకు తమ వంతు సాయం అందించేందుకు నాట్స్ ఎప్పుడూ ముందుంటుందని నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
ఆటిజం (Autism) పిల్లల మానసిక వికాసానికి నాట్స్ చేయూత అందిస్తుందని నాట్స్ మీడియా కో ఆర్డినేటర్ కిషోర్ తెలిపారు. గతంలో ఆటిజం ఆన్ వీల్స్ (Autism On Wheels) అనే వాహనాన్ని నాట్స్ (NATS) ఈ పాఠశాలకు అందించింది.