గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ ‘గేట్స్’ గత 3 సంవత్సరాలుగా ఉచిత యోగా మరియు సూర్య నమస్కారం తరగతులు నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా గత మార్చి 12 నుండి వచ్చే జూన్ 19 వరకు ఈ ఉచిత యోగా మరియు సూర్య నమస్కారం తరగతులు నిర్వహించనున్నారు. మరిన్ని వివరాలకు క్రింది ఫ్లయర్ చూడండి.
ఈ సెషన్స్ లో ఓంకార మంత్రాన్ని జపించడం, శరీర భాగాల వ్యాయామం, సూర్య నమస్కారాలు, యోగాసనాలు, వివిధ శ్వాస పద్ధతులు వంటివి ప్రముఖ గురువు, సన్ టీం స్థాపకులు, 2018 లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించిన ప్రవీణ్ మరిపెల్లి ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాలుగా ఉచిత శిక్షణ ఇస్తున్నారు. గేట్స్ నుంచి అనిత నెల్లుట్ల, శ్రీదేవి మంత్రవాది మరియు నవీన్ బత్తిని మోడరేటర్స్ గా వ్యవహరిస్తున్నారు.
ప్రవీణ్ మరిపెల్లి ఇప్పటివరకు 10 దేశాల్లోని 17 పర్వత ప్రదేశాల్లో 108 సూర్య నమస్కారాలు చేశారు. 2017 నుండి 7 మెగా సూర్య నమస్కార ఈవెంట్లు మరియు 3 చంద్ర నమస్కార ఈవెంట్లు నిర్వహించారు. సన్ టీం ని స్థాపించి గత 5 సంవత్సరాలలో సుమారు 9000 మందికి పైగా యోగా శిక్షణ ఇచ్చారు. ఈ మధ్యనే ఉత్తరాఖండ్ లోని అతి ఎత్తైన రాతి శీతల ప్రదేశంలో సాహసోపేతమైన 108 సూర్య నమస్కారాలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.
వర్చ్యువల్ గా ఆన్లైన్లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ ‘గేట్స్’ కార్యవర్గం మరియు అమెరికా అంతటా పాల్గొన్నవారు కలిసి గత రెండు సంవత్సరాలుగా 108 సూర్య నమస్కారాలు అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున పూర్తి చేశారు. ఈ సంవత్సరం మే 14న కూడా పూర్తి చేయడంతో పాటు వచ్చే అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 20, 2022 న కూడా 108 సూర్య నమస్కారాలు చేసేలా ప్రణాళిక రచించారు. మీరు కూడా పాల్గొనాలంటే లో రెజిస్టర్ చేసుకోండి.