తెలుగు షార్ట్ ఫిల్మ్ “ఎవడు, ఎవరు” ప్రముఖ ఐడ్రీమ్ మీడియాలో విడుదలయ్యింది. తండ్రి తన కుటుంబాన్ని కాపాడేందుకు ఎంత దూరమైనా వెళ్లగలడా? తరతరాలుగా వెంటాడుతున్న శాపం వారి సుఖశాంతులను భంగం చేస్తున్నప్పుడు అతని నిర్ణయాలు ఏ మలుపు తిరుగుతాయి? ఈ గాఢమైన ప్రశ్నల చుట్టూ తిరిగే తీవ్ర భావోద్వేగ కథతో రూపొందిన తెలుగు షార్ట్ ఫిల్మ్ (Short Film) ‘ఎవడు–ఎవరు’ ప్రేక్షకులను ఆలోచనలో ముంచెత్తుతుంది.
ఈ చిత్రంలో అట్లాంటా (Atlanta, Georgia) వాసులు వెంకట్ దుగ్గిరెడ్డి (Venkat Duggireddy), చందు బచ్చు, లావణ్య గూడూరుతదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. తన కుమార్తె ప్రేమికుడితో పారిపోయినప్పుడు ఒక తండ్రి మనసులో ఏం జరుగుతుంది?” అన్న సున్నితమైన భావోద్వేగాన్ని ఈ కథలో ప్రతిబింబించారు.
అమెరికాలోని అట్లాంటా, జార్జియా (Atlanta, Georgia)నేపథ్యంగా పూర్తిగా ఇక్కడే చిత్రీకరించిన ఈ చిత్రం (Short Film), బలమైన కథనం, లోతైన పాత్రల రూపకల్పన, ఉత్కంఠభరిత సన్నివేశాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. తండ్రి–కుటుంబ బంధం, భయం, త్యాగం, రహస్యాల మేళవింపుతో సాగే కథనం ప్రేక్షకులను చివరి వరకు కట్టిపడేస్తుంది.
సినిమాటిక్ విజువల్స్, శక్తివంతమైన నటన, భావోద్వేగాల్ని తాకే నేపథ్య సంగీతంతో ‘ఎవడు–ఎవరు’ ఒక గుర్తుండిపోయే కుటుంబ థ్రిల్లర్‌గా నిలుస్తుంది. ఈ ఆసక్తికరమైన షార్ట్ ఫిల్మ్ (Short Film) ను ఇప్పుడు ప్రముఖ ఐడ్రీమ్ మీడియాలో (iDream Media) లో వీక్షించండి.