Alpharetta, Atlanta, Georgia, October 4, 2025: తెలుగు షార్ట్ ఫిల్మ్ “ఎవడు, ఎవరు” గత శనివారం కాకతీయ ఇండియన్ రెస్టారెంట్లో ఘనంగా విడుదల అయ్యింది. ఈ కార్యక్రమానికి సినీప్రియులు, మీడియా ప్రతినిధులు, స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఉపేంద్ర నేతృత్వం వహించారు.
ఈ చిత్రంలో వెంకట్ దుగ్గిరెడ్డి, చందు బచ్చు, లావణ్య గుడూరు తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. చిత్ర దర్శకులు ఈ కథను నిజ జీవిత భావోద్వేగాల ఆధారంగా రూపొందించినట్లు తెలిపారు. చిత్ర బృందం తెలిపిన వివరాల ప్రకారం, “ఎవడు ఎవరు” షార్ట్ ఫిల్మ్ త్వరలోనే ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ iDream లో విడుదల కానుంది.
“తన కుమార్తె ప్రేమికుడితో పారిపోయినప్పుడు ఒక తండ్రి మనసులో ఏం జరుగుతుంది?” అన్న సున్నితమైన భావోద్వేగాన్ని ఈ కథలో ప్రతిబింబించారు. తండ్రి హృదయంలో చోటుచేసుకునే బాధ, ప్రేమ, మరియు ఆత్మవిశ్వాసం వంటి అంశాలను ఆవిష్కరించడమే ఈ చిత్ర ప్రధాన ఉద్దేశం అని దర్శకుడు (Movie Director) తెలిపారు.
ఆవిష్కరణ సందర్భంగా ప్రధాన నటుడు వెంకట్ దుగ్గిరెడ్డి (Venkat Duggireddy) మాట్లాడుతూ.. “ఈ పాత్ర నా హృదయానికి దగ్గరగా ఉంది. ప్రతి తండ్రికి ఈ కథలోని బాధ, ప్రేమ అనుభూతి అవుతాయి” అన్నారు. చందు బచ్చు (Chandu Bachu) మాట్లాడుతూ, “ఈ కథ ప్రతి కుటుంబానికి దగ్గరగా ఉంటుంది. అవకాశం ఇచ్చినందుకు కృతఙ్ఞతలు” అని అన్నారు.
ఈ సందర్భంగాపలువురు స్నేహితులు ప్రసంగిస్తూ.. సినిమాలంటే అమితమైన ఇష్టమున్న వెంకట్ దుగ్గిరెడ్డి (Venkat Duggireddy) మరిన్ని చిత్రాలలో నటించి మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. అలాగే ‘ఎవడు, ఎవరు’ షార్ట్ ఫిల్మ్ విజయవంతం అవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జాన్స్ క్రీక్ సిటీ మేయర్ ప్రొటెమ్ (Johns Creek City Mayor Pro Tem) దిలీప్ టుంకి, బాల రెడ్డి ఇందుర్తి, శ్రీని వంగిమళ్ళ, అంజయ్య చౌదరి లావు, రవి కందిమళ్ల, గౌతమ్ గోలి, రమేష్ చాపరాల, రాఘవరెడ్డి గోశాల, శ్రీని కొట్లూర్, రామ్ మద్ది, బాల మద్ద, సాయిరాం కారుమంచి, పవన్ పూసర్ల, శ్రీనివాస్ నన్నపనేని, బాబీ వేములపల్లి, లక్ష్మి మండవల్లి తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
అదే రోజు వెంకట్ దుగ్గిరెడ్డి పుట్టినరోజుని పురస్కరించుకొని కేక్ కట్ చేసి అందరికీ పంచారు. అందరూ నటులు వెంకట్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు (Birthday Wishes) తెలియజేశారు. ఈ సందర్భంగా “ఎవడు, ఎవరు” తెలుగు షార్ట్ ఫిల్మ్ విడుదలకి విచ్చేసిన అందరికీ వెంకట్ కృతజ్ఞతలు తెలియజేశారు. డిన్నర్ అనంతరం కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.