Connect with us

News

WETA ఫౌండర్ & కోడలు దెబ్బకి 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఎర్రబెల్లి బేజారు

Published

on

అమెరికాలోని ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ (WETA) ఫౌండర్, ఫౌండర్ ప్రెసిడెంట్ మరియు ప్రస్తుత Advisory చైర్ ఝాన్సీ రెడ్డి హనుమాండ్ల (Jhansi Reddy Hanumandla) అంటే తెలియనివారు ఉండరు. వేటా (WETA) స్థాపనకు ముందు పలు సంస్థల్లో చేసిన సేవలు ఒక ఎత్తైతే, వేటా ద్వారా తను అందించిన సేవలు మరొక ఎత్తు.

ఇలాంటి సమయంలో తన అమెరికా (US) పౌరసత్వాన్ని సైతం వీడి తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయడానికి జనగామ జిల్లా, పాలకుర్తి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. కానీ అమెరికా పౌరసత్వం ఉన్న తను తిరిగి భారత (India) పౌరసత్వం పొందే ప్రాసెస్ లేట్ అవడంతో తన స్థానంలో తన 26 ఏళ్ళ కోడలు యశస్విని రెడ్డి మామిడాల ని రంగంలోకి దింపారు.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ రేవంత్ రెడ్డి అనుముల (Revanth Reddy Anumula) తోపాటు వీరు ఇరువురూ ఉధృతంగా ప్రచారం నిర్వహించి 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ పాతుకుపోయిన భారత రాష్ట్ర సమితి (Bharat Rashtra Samithi) అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు కోటని 47 వేలకి పైగా మెజారిటీతో బద్దలు కొట్టారు.

ఎర్రబెల్లి (Errabelli Dayakar Rao) రాజకీయ అనుభవం అంత వయస్సు కూడా లేని హనుమాండ్ల వారి కోడలు అయిన మామిడాల వారి ఆడపడుచు యశస్విని రెడ్డి (Yashaswini Reddy) యంగెస్ట్ ఎమ్మెల్యే గా రికార్డు సాధించడం తెలంగాణ (Telangana) రాజకీయాల్లో పెను సంచలనం అయ్యింది. దీంతో ఇటు అమెరికా స్నేహితులు అటు పాలకుర్తి వాసులు హర్షిస్తున్నారు.

పాలకుర్తి (Palakurthi) లో కాంగ్రెస్ పార్టీ (Indian National Congress Party) టిక్కెట్ ఆశించి భంగపడ్డ డా. తిరుపతి రెడ్డి ఎర్రంరెడ్డి వంటి వారు ఝాన్సీ రెడ్డి, యశస్విని రెడ్డి (Yashaswini Reddy) గెలవరని, తిరిగి అమెరికా పయనం అవుతారని ఎర్రబెల్లి దయాకర్ రావు కి మద్దతుగా నిలిచినప్పటికీ ఫలితం లేకపోవడం విశేషం.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected