Connect with us

News

GWTCS ఆధ్వర్యంలో ప్రపంచ వృద్ధుల దినోత్సవ వేడుకలు @ Washington DC

Published

on

Washington DC, August 21, 2024: తమ జీవితకాలం కష్టించి.. వ్యక్తిగతంగా కుటుంబాన్ని, వృత్తి పరంగా ఎంచుకున్న రంగాన్ని, సమాజ పరంగా వివిధ దశల్లో తమ అనుభవాన్ని రంగరించి పలు తరాలకు దిశా నిర్దేశం చేసి.. వారి జీవితమే ఒక సందేశంగా.. నేటికీ సంఘటితంగా నిలుస్తూ.. జీవితం చివరి దశలో చిన్న పలకరింపుకే పొంగిపోతూ.. ఆప్యాయంగా మాట్లాడితే చాలు అనుకునే పెద్దలు ఎందరో!

పలు దేశాలలో భిన్న సంస్కృతుల మధ్య, సమకాలీన సమాచార విప్లవ సంధి కాలంలో.. సామాజిక, ఆర్థిక, పర్యావరణ, ఆరోగ్య రంగాలలో వృద్ధాప్యంలో వారు ఎదుర్కుంటున్న సమస్యల పట్ల స్పందించి.. రోజూ నలుగురితో మాట్లాడితే చాలు.. తన భావాలు పంచుకుంటే చాలు.. ఎప్పుడూ ఉండే సమస్యలను తేలికగా అధిగమిస్తామని అనుకుంటారు.

ఈ (World Senior Citizen’s Day) కార్యక్రమంలో అమెరికా రాజధాని ప్రాంతంలో ఎన్నో సంవత్సరాలుగా వేలాది మంది విద్యార్థులను క్యూరీ స్కూల్ (Curie Learning) వేదికగా తీర్చి దిద్దిన విద్యావేత్త వెంకట్రావు మూల్పూరి (Venkata Rao Mulpuri) గారిని సన్మానించారు. ఆయన మాట్లాడుతూ ఈ వయసులో తమకు కావాల్సింది జీవన సంఘర్షణ కాదని..ఆధ్యాత్మికత, తీపి జ్ఞాపకాలు మాత్రమే అని వారు తెలిపారు.

అమెరికా (USA) వ్యాప్తంగా పెద్దలు, తెలుగు వారు.. వారి కుటుంబ సమేతంగా GWTCS (Greater Washington Telugu Cultural Sangam) స్వర్ణోత్సవ వేడుకలలో పాల్గొనాలని ఆహ్వానం పలుకుతున్నామని భాను మాగులూరి (Bhanu Maguluri) తెలిపారు. తమ జీవిత సారాన్ని, సందేశాన్ని ప్రపంచానికి అందిస్తూ.. నేటికీ నిబద్ధతతో కష్టపడుతూ యువతరానికి ఆదర్శంగా నిలుస్తున్న పెద్దలు.. వృద్దులు.. మార్గదర్శకులు.. ఎందరో మహానుభావులు.. అందరికి అభినందనలు.. శుభాకాంక్షలు అన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected